
నాణ్యమైన విద్యుత్ అందించాలి
పిడుగురాళ్ల: వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ డాక్టర్ పి.విజయ్‌కుమార్ సూచించారు. పిడుగురాళ్ల పట్టణ, గ్రామీణ పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులతో రూరల్ విద్యుత్ శాఖ కార్యాలయంలో గురవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్‌ఈ మాట్లాడుతూ... విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గించాలని, పెండింగ్ పనులను పూర్తి చేయాలని సూచించారు. కరెంట్ బిల్లుల వసూళ్లలో అలసత్వం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ పరిధిలోని జానపాడు, రూరల్ పరిధిలోని జూలకల్లు సబ్ స్టేషన్‌లలో తనిఖీలు నిర్వహించారు. వేసవిలో లోడ్ పెరుగుతున్న కారణంగా దానికి అనుగుణంగా విద్యుత్ శాఖ సిబ్బంది సిద్ధంగా ఉండి అంతరాయాలు లేకుండా విద్యుత్‌ను అందించాలని ఆదేశించారు. 50 శాతం అదనపు లోడ్ సబ్సిడీ స్కిమ్‌ను గృహ వినియోగదారులందరు వినియోగించుకోవాలని సూచించారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులతో పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.నాగసురేష్‌బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్.సింగయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
విద్యుత్ శాఖ ఎస్‌ఈ
డాక్టర్ పి.విజయ్‌కుమార్