జాబ్‌ కార్డులను తొలగించడం అన్యాయం | - | Sakshi
Sakshi News home page

జాబ్‌ కార్డులను తొలగించడం అన్యాయం

Apr 4 2025 1:10 AM | Updated on Apr 4 2025 1:10 AM

జాబ్‌ కార్డులను తొలగించడం అన్యాయం

జాబ్‌ కార్డులను తొలగించడం అన్యాయం

అమరావతి: యాక్టివ్‌గా లేవనే సాకుతో జాబ్‌ కార్డులను తొలగించడం అన్యాయమని జాబ్‌ కార్డుతో సంబంధం లేకుండా అడిగిన ప్రతి ఒక్కరికీ పని చూపాలని వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి రవిబాబు అన్నారు. గురువారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల సమస్యలు తెలుసుకోవటం కోసం నిర్వహించిన ఉపాధి హామీ బైక్‌ యాత్రలో ఆయన పాల్గొన్నారు. మండలంలోని పలు గ్రామాలలోఉపాధి హామీకూలీలు తమ సమస్యలను బైక్‌యాత్రలో వ్యవసాయ కార్మికసంఘ ప్రతినిధులకు వివరించారు. రవిబాబు మాట్లాడుతూ గతంలో ఉపాధి హామీ పనులుచేసిన కూలీలు కూడా ప్రస్తుతం జాబ్‌ కార్డులు యాక్టివ్‌గా లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. జాబ్‌కార్డులు లేక, పనులకు వెళ్లలేక అనేకమంది కూలీలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆధార్‌కార్డుకు బ్యాంకు ఎకౌంటుకి ఫోన్‌ నెంబర్లకు లింకులు లేకపోవటం కూడా పెద్ద సమస్యగా మారిందన్నారు. నిరక్ష్యరాశ్యులైన కూలీలకు ఫోన్‌నంబరు లింక్‌చేయటంపై అవగాహన లేక చేసిన పనికి వేతనాలు అందక కూలీలు ఇబ్బంది పడుతున్నారన్నారు. సమస్యలు పరిష్కరించి, కూలీలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సంఘం నాయకులు జమ్మలమూడి భగత్‌, ఏపూరి వెంకటేశ్వర్లు యేసయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement