మసకబారింది! | - | Sakshi
Sakshi News home page

మసకబారింది!

Apr 8 2025 7:21 AM | Updated on Apr 8 2025 7:21 AM

మసకబా

మసకబారింది!

మూడో కన్ను

నకరికల్లు: 2023 జూలైలో స్థానిక ఇందిరమ్మకాలనీలోని ఒక ఇంట్లో చోరీ జరిగింది. సుమారు రూ.7లక్షల నగదు, కొంత బంగారం చోరీకి గురైంది. చోరీ కేసు నమోదు చేసిన పోలీసులు వారంరోజుల్లోనే కేసును ఛేదించగలిగారు. సొత్తును రికవరీ చేసి బాధితులకు అప్పగించారు.

– అదే ఏడాది ఆగస్టులో హైవే పక్కన ఉన్న ఏటీఎం ధ్వంసం చేసిన ఘటనలోను నిందితుడిని ఒక్కరోజులోనే పట్టుకోగలిగారు. అంత త్వరగా కేసులు ఛేదించడానికి పోలీసులకు ఉపయోగం పడిన ఆయుధం సీసీ కెమెరా.. ఇలా ఎన్నో కేసులను అతితక్కువ సమయంలో పోలీసులు ఛేదించగలిగారంటే అది కేవలం సీసీ కెమెరాలు అందించిన ఆధారాలే. 2023లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం హయాంలో 2023 సంవత్సరంలో నకరికల్లు గ్రామంలోని ప్రధాన కూడళ్లలో, అలాగే అద్దంకి–నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారి పక్కన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రూ.4 లక్షలు వెచ్చించి 28 పెద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎక్కడ ఏ మూలన ఏం జరిగినా పోలీస్‌ కంట్రోల్‌ రూంలో రికార్డయి తెలిసిపోయేది. చోరీలు అరికట్టేందుకు, చోరీ కేసుల్లోని, రోడ్డు ప్రమాదాల్లో నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర పోషించాయి. సీసీ కెమెరాలు ఇచ్చిన క్లూ ఆధారంగా ప్రమాదానికి కారణమై తప్పించుకుపోయిన నిందితులను వాహనాలతో సహా గుర్తించారు. ఇలాంటి ఎన్నో ఘటనలకు కారణమైన ఆధారాలను అందించిన సీసీ కెమెరాలు గత కొన్నిరోజులుగా ఏ ఒక్కటీ పనిచేయడం లేదు. దీంతో గ్రామస్తులు మళ్లీ భయం నీడన బతకాల్సి వస్తుంది.

అలంకారప్రాయంగా అద్దంకి – నార్కెట్‌పల్లి రహదారిపై ఉన్న సీసీ కెమెరా

నకరికల్లులో మొరాయించిన సీసీ కెమెరాలు 2023లో రూ.4లక్షలు వెచ్చించి 28 కెమెరాలు ఏర్పాటు సీసీ కెమెరాల సాయంతో ఎన్నో కేసులు సత్వరమే ఛేదించిన పోలీసులు గత కొన్నిరోజులుగాఏ ఒక్కటీ పనిచేయని వైనం ప్రశ్నార్థకంగా మారిన భద్రత

సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో మళ్లీ ఇటీవల కాలంలో ఘర్షణలు, చోరీలు జరుగుతున్నాయని రోడ్డుపక్కన గృహాల వారు, శివారు ప్రాంతంలో నివాసముంటున్న వారు, దుకాణదారులు వాపోతున్నారు. వేసవి కావడంతో ఎక్కువగా దొంగతనాలు జరుగుతుంటాయి. అందునా సెలవుల కాలంలో ఇళ్లకు తాళాలు వేసి కుటుంబసమేతంగా ప్రజలు ఊళ్లకు, యాత్రలకు వెళ్తుంటారు. ఈ నేపధ్యంలో ఆస్తుల భధ్రత ప్రశ్నార్ధకంగా మారింది. అందునా అద్దంకి – నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారి పక్కన గ్రామం కావడంతో చోరీలతో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. గతంలో జరిగిన చోరీల నేపధ్యంలో సీసీకె మెరాలు పనిచేయడం లేదన్న సమాచారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మరమ్మతుకు గురైన సీసీ కెమెరాలు సత్వరమే వినియోగం తేవాలని ప్రజలు కోరుతున్నారు.

మసకబారింది! 1
1/1

మసకబారింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement