అర్జీలకు సత్వర పరిష్కారం | - | Sakshi

అర్జీలకు సత్వర పరిష్కారం

Apr 8 2025 7:21 AM | Updated on Apr 8 2025 7:21 AM

అర్జీ

అర్జీలకు సత్వర పరిష్కారం

జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు పీజీఆర్‌ఎస్‌లో 300 అర్జీలు స్వీకరణ

చిలకలూరిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు చెప్పారు. పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనంజయ్‌ వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. వివిధ సమస్యలకు సంబంధించి వచ్చిన 300 అర్జీలను స్వీకరించారు.

న్యాయమైన పరిహారం ఇప్పించాలి

చీరాల వాడరేవు నుంచి నకరికల్లుకు రోడ్డు వేస్తున్నారు. ఇందులో మా కుటుంబానికి సంబంధించి ఐదు ఎకరాల భూమిని రోడ్డు నిర్మాణానికి తీసుకున్నారు. బొప్పూడి వద్ద రోడ్డుకు పడమట ఉన్న పొలం ఎకరాకు రూ.1.30కోట్ల చొప్పున పరిహారం చెల్లించారు. తూర్పు వైపు పొలానికి ఎకరాకు కేవలం రూ. 33లక్షలు మాత్రమే ఇచ్చారు. ఇది అన్యాయమని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతునే ఉన్నాం. మాకు న్యాయం చేయాలి.

– షేక్‌ అమీర్‌జానీ, బొప్పూడి

దేవాలయ మాన్యం ఆక్రమించారు

అమీన్‌సాహెబ్‌పాలెం గ్రామంలో నివాసం ఉండే గుర్రం ఇంటిపేరు కలవారి కుల దేవత రేణుకమ్మతల్లి గుడికి మా పూర్వీకులు 12.5 ఎకరాల భూమి ఇచ్చారు. దేవాలయ నిర్వహణ కోసం ఈ భూమిపై వచ్చే ఆదాయం ఉపయోగిస్తాం. ఇదే గ్రామానికి చెందిన ఒకరు ఈ భూమిలో 1.59 ఎకరాలు ఆక్రమించి పట్టా పుట్టించుకున్నాడు. ఈ విషయమై పూర్తి విచారణచేసి ఆక్రమణకు గురైన భూమిని దేవాలయానికి అప్పగించాలి.

– గుర్రం ఉపేంద్ర, గుర్రం సత్యనారాయణ, అమీన్‌సాహెబ్‌పాలెం

శ్మశానం అభివృద్ధి చేయాలి

పట్టణంలోని శారదా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సమీపంలో 2.62 ఎకరాల్లో హిందూ, క్రైస్తవులకు కలిపి ఉమ్మడిగా శ్మశానవాటిక ఉంది. ఇందులో ఇప్పటికే 62 సెంట్లు అక్రమణలకు గురైంది. మిగిలిన రెండు ఎకరాల్లో ఒక ఎకరంలో హిందువులు, మరో ఎకరంలో క్రైస్తవులు ఉపయోగించుకుంటున్నారు. దీనిని అధికారికంగా రెండు వర్గాల వారికి పంచిపెడితే అభివృద్ధి చేసుకొనే అవకాశం ఉంటుంది.

– కందా భాస్కరరావు, చిలకలూరిపేట

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కొర్రపాటి ఆదినారాయణ అనే వ్యక్తి నా వద్ద నుంచి రూ.2లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేశాడు. పెద్ద మనషులతో అనేక పర్యాయాలు అడగ్గా రూ.1.20 లక్షలు చెల్లించాడు. ఇంకా రూ. 80 వేలు చెల్లించాల్సి ఉంది. ఇదే విషయాన్ని ఇప్పటికే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశాను. నాకు న్యాయం చేయాలి.

– గాలం సదాశివ బ్రహ్మం, చిలకలూరిపేట

పెంచుకున్న వాడే మోసం చేశాడు

ఎవరూ లేని అనాఽథ అని చెప్పి నక్కా వెంకటేశ్వరరావును పెంచి పెద్ద చేశాం. ఇల్లు కూడా కట్టించి ఇచ్చి వివాహం చేశాం. క్రికెట్‌ బెట్టింగులకు అలవాటు పడి ఆస్తి మొత్తం పోగొట్టాడు. వాడి పిల్లవాడికి ఆరోగ్యం బాగాలేదని నా వద్దకు వచ్చి బాధపడితే ఆరు సవర్ల బంగారు గాజులు తాకట్టుపెట్టి డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు అడిగితే ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాడు. వృద్ధురాలిలైన నేను పక్షవాతంతో బాధపడుతున్నాను. అధికారులు నాకు న్యాయం చేయాలి. – నగరి లక్ష్మి, చిలకలూరిపేట

అర్జీలకు సత్వర పరిష్కారం 1
1/5

అర్జీలకు సత్వర పరిష్కారం

అర్జీలకు సత్వర పరిష్కారం 2
2/5

అర్జీలకు సత్వర పరిష్కారం

అర్జీలకు సత్వర పరిష్కారం 3
3/5

అర్జీలకు సత్వర పరిష్కారం

అర్జీలకు సత్వర పరిష్కారం 4
4/5

అర్జీలకు సత్వర పరిష్కారం

అర్జీలకు సత్వర పరిష్కారం 5
5/5

అర్జీలకు సత్వర పరిష్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement