చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం | - | Sakshi
Sakshi News home page

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

Published Fri, Sep 27 2024 1:00 AM | Last Updated on Fri, Sep 27 2024 1:00 AM

చాకలి

పెద్దపల్లిరూరల్‌: తెలంగాణ సాయుధ పోరాటంలో వీరవనిత చాకలి ఐలమ్మ చూపిన పోరాటపటిమ మహిళా శక్తికి స్ఫూర్తిదాయకమని అడిషనల్‌ కలెక్టర్‌ అరుణశ్రీ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో గురువారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఏవో శ్రీనివాస్‌, బీసీ వెల్ఫేర్‌ అధికారి అనిల్‌కుమార్‌తో పాటు నాయకులు పాల్గొన్నారు.

మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ

గోదావరిఖని: మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్‌ అన్నారు. గురువారం రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ ఆవరణలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పెత్తందార్ల దురాగతాలను మొక్కవోని ధైర్యంతో ఎదిరించిన తీరు అందరికీ ఆదర్శమన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ సి.రాజు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ రాఘవేంద్రరావు, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మల్లారెడ్డి, ఏఆర్‌ ఏసీపీ ప్రతాప్‌, సురేంద్ర, సీఐలు రవీందర్‌, అజయ్‌ బాబు, ఆర్‌ఐ దామోదర్‌, మల్లేశం, శ్రీనివాస్‌, వామనమూర్తి, సంపత్‌, సీపీఓ సిబ్బంది, వివిధ వింగ్స్‌ సిబ్బంది, ఏఆర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం1
1/1

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement