సర్కారు బడుల్లో మెరుగైన విద్యనందించాలి | - | Sakshi
Sakshi News home page

సర్కారు బడుల్లో మెరుగైన విద్యనందించాలి

Published Fri, Sep 27 2024 1:00 AM | Last Updated on Fri, Sep 27 2024 1:00 AM

సర్కారు బడుల్లో మెరుగైన విద్యనందించాలి

పెద్దపల్లిరూరల్‌: ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఆ దిశగా ఉపాధ్యాయులు చొరవ చూపాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి మండలం హన్మంతునిపేట, ముత్తారం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చి విద్యార్థులు నాణ్యమైన విద్యనభ్యసించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. పాఠశాలలో కంప్యూటర్‌ విద్యను బోధించాలని, రిపేరింగ్‌ అవసరమున్న కంప్యూటర్లను తొలగించాలన్నారు. మధ్యాహ్న భోజన నాణ్యతలో లోపాలుంటే చర్యలు తప్పవన్నారు. అంగన్‌వాడీ కేంద్ర భవనం పరిశీలించిన కలెక్టర్‌ మరో భవనంలోకి తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంగన్‌వాడీలకు వచ్చే చిన్నారుల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. హెచ్‌ఎం దశరథం, నాగరాజు తదితరులున్నారు.

కరాటే విజేతలకు అభినందన

కరాటే కుంగ్‌ఫూ, తైక్వాండ్‌ పోటీల్లో జిల్లా విద్యార్థులు నైపుణ్యమైన ప్రదర్శన చూపి 20 బంగారు, నాలుగు వెండి పతకాలను సాధించడం అభినందనీయమని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం జాతీయ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. కరాటే మాస్టర్లు సుమన్‌, సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement