జైలులో రీజినల్ లెవెల్ రిట్రీట్ ప్రోగ్రాం
కరీంనగర్ క్రైం: కరీంనగర్‌లోని జిల్లా జైలులో రీజినల్ లెవెల్ రిట్రీట్ మొదటి విడత కార్యక్రమాన్ని వరంగల్ రేంజ్ డీఐజీ(జైళ్ల శాఖ) ఎం.సంపత్, శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ యు.ఉమేశ్‌కుమార్ గురువారం జ్యోతిప్రజ్వలన చేసి, ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. జైళ్ల శాఖ సిబ్బంది సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో అధునాతన టెక్నాలజీతో జైలు నిర్మిస్తున్నామని, ఇతర జిల్లాల్లోనూ నిర్మాణాలు చేపట్టి, ఖైదీల రద్దీని తగ్గిస్తామన్నారు. వీసీ మాట్లాడుతూ.. జైళ్ల శాఖ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను కొనియాడారు. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి, జైళ్లను మెరుగుపర్చుకోవాలని సూచించారు. సైకియాట్రిస్ట్ ఎల్.వర్ణి, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్‌రావు, జిల్లా జైలు పర్యవేక్షణాధికారి కె.శ్రీనివాస్, జైలు వైద్యాధికారి వేణుగోపాల్, జైలర్లు శ్రీనివాస్, రమేశ్, పర్శరాం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment