కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరం వై ద్య విద్యకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఇప్పటికే సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సి మ్స్) కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మెడికల్ కాలే జీకి అనుబంధంగా తాజాగా నర్సింగ్ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో జారీచేసింది. 60 మంది విద్యార్థులను కాలేజీలో చేర్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో 13 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలను మంజూరు చేస్తూ జీవో నంబర్ 183ను రాష్ట్ర కార్యదర్శి క్రిస్టినా జెడ్‌చాంగ్ జారీచేశారు. వీటిలో రామగుండం కాలేజీ కూడా ఉంది. వీటి నిర్వహణ, నిర్మాణం కోసం రూ.338 కోట్లు కూడా మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఒక్కో కాలేజీకి రూ.26 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. కాలేజీ నిర్మాణం, ఫర్నీచర్, తదితర వాటిని సమకూర్చడానికి తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(టీజీ ఎంఎస్ ఐటీసీ)కి బాధ్యతలు అప్పగించారు.
జీవో జారీచేసిన ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment