పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఇసుక అక్రమరవాణాదారులపై ఉక్కుపాదం మోపేలా కఠిన చర్యలు తీసుకున్నామని, అక్రమంగా ఇసుక రవాణా చేసే టిప్పర్‌కు రూ.లక్ష, ట్రాక్టర్‌కు రూ.25వేల వరకు జరిమానా వసూలు చేస్తున్నామని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది నవంబర్ 21 వరకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న 63 టిప్పర్లు, 86 ట్రాక్టర్లు పట్టుకుని రూ.25,99,790 జరిమానా వసూలు చేసినట్లు ఆయన వివరించారు. జిల్లా ప్రజలు ఇసుక కోసం ఆన్‌లైన్‌లో సాండ్‌టాక్సీ ద్వారా బుకింగ్ చేసుకుంటే 24 గంటల్లోగా డెలివరీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment