
AP Elections Political Latest Updates Telugu
6:06PM, డిసెంబర్ 29, 2023
కాకినాడ
పవన్ తీరుపై జన సైనికుల ఆగ్రహం
- డివిజన్ కమిటీల సమీక్షలో దూరం పెట్టడంపై ఓ కార్యకర్త అసహనం
- కారుల్లో వచ్చిన వారు నేరుగా పవన్ కల్యాణ్‌ని కలిసి కండువాలు వేసుకుని ఫోటోలు దిగుతున్నారని 18వ డివిజన్‌కు చెందిన ఓలేటి విజయకుమమార్ ఆవేదన.
- జనసేన ఆవిర్భావం నుంచి జెండా మోస్తూ.. పవన్ కల్యాణ్ ఎక్కడ మీటింగ్ పెట్టినా వెళ్ళాలనన్న విజయకుమార్
- పవన్ కల్యాణ్‌కు ఇది న్యాయమేనా అంటూ ప్రశ్నించిన విజయకుమార్
5:15PM, డిసెంబర్ 29, 2023
ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీలను మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు: పేర్ని నాని
- వెనుకబడిన వర్గాలకు చంద్రబాబు ప్రాధాన్యత లేదు
- చంద్రబాబు హయాంలో మైనారిటీ, ఎస్టీలకు రాజ్యాధికారం లో భాగస్వామ్యం కల్పించలేదు
- ఓడిపోయిన నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇచ్చారు
- 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి వర్గంలో స్థానం కల్పించారు
- ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ముస్లిం లకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్ దే
- 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సంక్షేమం ఎందుకు పట్టించుకోలేదు?
- రుణమాఫీ పేరుతో రైతులు డ్వాక్రా రుణాలను మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు
- మీకు మంచి జరిగుంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయండి
4:11PM, డిసెంబర్ 29, 2023
టిడిపి వన్నీ స్కాంలే, స్కీంల్లేవు
- అల్లూరి జిల్లాలో మాట్లాడిన ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ
- టిడిపి హయాంలో స్కీములు లేవు. స్కాములు మాత్రమే
- టిడిపి హయములో గిరిజన ప్రాంతాల్లోఖనిజ సంపద దోపిడీ జరిగింది.
- చంద్రబాబు నాయుడు హయాంలోఒక్క స్కీమ్ అయిన గుర్తుందా?
- సామాజిక బస్సు యాత్రతో అరకులో మరింత ఉత్సాహం వచ్చింది
4:09PM, డిసెంబర్ 29, 2023
వెనుకబడిన వర్గాలంటే చంద్రబాబుకు చిన్నచూపు
- అనంతపురంలో ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వ్యాఖ్యలు
- జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే సామాజిక న్యాయం
- సామాజిక సాధికారత నినాదం కాదు.. మా విధానం అని సీఎం జగన్ నిరూపించారు
- వెనుకబడిన వర్గాలను ఓటు బ్యాంకులా వాడుకున్నది చంద్రబాబు నాయుడు
- సంక్షేమ పాలన రథసారథి ముఖ్యమంత్రి వైఎస్ జగన్
- ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్ దే
- వెనుకబడిన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మకం- డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
4:05PM, డిసెంబర్ 29, 2023
బీసీలను ఏనాడైనా గుర్తించారా లోకేష్?
- బీసీ చట్టానికి సంబంధించి లోకేష్ వ్యాఖ్యలను తప్పుబట్టిన మంత్రి వేణుగోపాలకృష్ణ
- బీసీలకు ప్రత్యేక చట్టాలు అమలు చేస్తే మొదట అది నీ తండ్రి పైనే ప్రయోగించాల్సి ఉంటుంది
- బీసీలను దూషించిన వ్యక్తి నీ తండ్రి
- బీసీలను ఇప్పుడు మీరు ప్రత్యేకంగా అభివృద్ధి పథంలోకి తీసుకురావాల్సిన అవసరం లేదు
- ఇప్పుడు బీసీలు చైతన్యవంతులు అయ్యారు కాబట్టే 2019లో మీకు 23 స్థానాలు ఇచ్చారు
- ఇప్పుడు మూడు మాత్రమే మిగులుస్తారేమో...
- బీసీ యువత డాక్టర్లు ఇంజనీర్లు రావడం 2004లో వైయస్సార్ హయాం నుంచి ప్రారంభమైంది
- ఫీజు రీయంబర్స్‌మెంట్ బీసీలకు అమలు చేసిన మహానేత వైఎస్ఆర్
- ఒక పీకే సరిపోలేదనుకుని ఇప్పుడు మరో పీకేను టిడిపి తెచ్చుకుంది
- ఇద్దరు పీకేల మధ్యన లోకేష్ ఉన్నాడు
3:55PM, డిసెంబర్ 29, 2023
రెడ్‌బుక్ వ్యాఖ్యలపై నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు
- రెడ్‌బుక్ పేరుతో నారా లోకేష్ బెదిరిస్తున్నారంటూ ఏసీబీ కోర్టును ఆశ్రయించిన సీఐడీ అధికారులు
- కోర్టు సూచనల మేరకు లోకేష్‌కు వాట్సాప్‌లో నోటీసులు పంపిన సీఐడీ
- నోటీసు అందుకున్నట్లు వాట్సాప్‌లో సీఐడీకి సమాధానం ఇచ్చిన లోకేష్
- కేసు విచారణను ఇప్పటికే జనవరి 9కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
- లోకేష్‌కి నోటీసులు ఇవ్వడానికి నిన్న(గురువారం) ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు
- నోటీసులు నేరుగా తీసుకోకపోవడంతో వాట్సాప్‌లో నోటీసులు పంపిన సీఐడీ
3:50PM. డిసెంబర్ 29, 2023
సీఎం జగన్‌పై ఎల్లో మీడియా అక్కసు వెళ్లగక్కుతోంది: జూపూడి ప్రభాకర్
- చంద్రబాబును జీవితంలో నమ్మకూడదని ప్రజలు డిసైడ్ అయ్యారు
- సీఎం జగన్ చేస్తున్న మంచిని చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేకపోతున్నారు
3:11PM, డిసెంబర్ 29, 2023
జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే సామాజిక న్యాయం:డిప్యూటీ సీఎం అంజాద్ బాష
- సామాజిక సాధికారత నినాదం కాదు.. మా విధానం అని సీఎం జగన్ నిరూపించారు
- వెనుకబడిన వర్గాలను ఓటు బ్యాంకులా వాడుకున్న దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు
- సంక్షేమ పాలన రథసారథి ముఖ్యమంత్రి వైఎస్ జగన్
- ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీలను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్‌దే
- వెనుకబడిన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మకం
- 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము, ధైర్యం టీడీపీ-జనసేన పార్టీలకు ఉందా?
- సర్వేల ఆధారంగానే టిక్కెట్ల కేటాయింపు
- సిట్టింగ్ ఎమ్మెల్యేందరికీ టిక్కెట్లు కేటాయించాలనే నిబంధన ఎక్కడా లేదు
3:04PM, డిసెంబర్ 29, 2023
టీడీపీ హయాంలో స్కీములు లేవు. స్కాములు మాత్రమే: ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ
- టీడీపీ హయాంలో గిరిజన ప్రాంతాల్లోఖనిజ సంపద దోపిడీ జరిగింది.
- చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్క స్కీమ్ అయిన గుర్తుందా.
- సామాజిక బస్సు యాత్రతో అరకు మరింత అందంగా తయారయింది.
1:25 PM, డిసెంబర్ 29, 2023
BCల రిజర్వేషన్లను అడ్డుకున్నదెవరు?
బీసీల రిజర్వేషన్లు అడ్డుకున్నది నీ బాబే లోకేష్
- టీడీపీ నేత కోర్టుకు వెళ్లడంతో స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు కోత
- బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయిస్తూ 2019 డిసెంబరు 28న జగన్ సర్కార్ GO
- ఆ వెంటనే తెర వెనక చంద్రబాబు మంతనాలు
- చంద్రబాబు ఆదేశాలతో సుప్రీంకోర్టుకు వెళ్లిన టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి
- జగన్ సర్కార్ ఇచ్చిన GOపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు
- దీంతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికే పరిమితం
- స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు దక్కాల్సిన 10% రిజర్వేషన్లకు గండికొట్టిన తెలుగుదేశం పార్టీ
- గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసినా స్థానిక సంస్థల ఎన్నికలను 2014–19 మధ్య నిర్వహించని చంద్రబాబు
- వైఎస్ జగన్ సీఎం అయ్యాక బీసీలకు 34% రిజర్వేషన్లతో పాటు మొత్తం 58.95% రిజర్వేషన్లు కల్పించి అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ
- కానీ, టీడీపీ నేత కోర్టుకెళ్లి బీసీల రిజర్వేషన్లకు కోత పెట్టించారు.
- దీంతో.. జెడ్పీ చైర్మన్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు సహా దాదాపు 15 వేలకు పైగా పదవులను BC వర్గాలు కోల్పోవాల్సి వచ్చింది.
- నిజానికి.. 2013లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో అమలుచేసిన రిజర్వేషన్లతో పోలిస్తే బీసీలకు ఏ మాత్రం రిజర్వేషన్లు తగ్గించకుండా.. అదే సమయంలో ఎస్సీ, జనరల్ కేటగిరి రిజర్వేషన్లు పెరిగేలా.. పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 59.85 శాతం రిజర్వేషన్ల అమలుకు సీఎం వైఎస్ జగన్ సర్కారు 2019 డిసెంబరులో జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో జీఓ
- రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఏపీలో తగ్గిన ఎస్టీల జనాభా
- ఎస్సీల జనాభా పెరిగిపోవడంతో నిబంధనల ప్రకారమే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల మార్పులు
- బీసీల రిజర్వేషన్లు 34 శాతం కొనసాగిస్తూ.. ఎస్టీలకు తగ్గిపోయిన రిజర్వేషన్ల స్థానంలో ఎస్సీలకు 2013లో ఉన్న 18.30 శాతం నుంచి 19.08 శాతానికి పెంపు
- జనరల్ కేటగిరి అభ్యర్థులకు కూడా 2013లో అమలుచేసిన 39.44 శాతం రిజర్వేషన్లు 40.15 శాతానికి పెంపు
- ఈ మేరకు జగన్ ప్రభుత్వం 2019 డిసెంబరు 28న GO 176 జారీ
- పంచాయతీరాజ్ శాఖాధికారులు కూడా ZP చైర్మన్, MPP, ZPTC, MPTC, సర్పంచి, వార్డు సభ్యుల పదవుల్లో బీసీలకు 34 శాతం చొప్పున రిజర్వేషను ఖరారు
- 2020 జనవరిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన పంచాయతీరాజ్
- బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీఓ
ఆ జీవోపై ‘సుప్రీం’లో టీడీపీ కేసు
- జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు కుట్ర
- కర్నూలు జిల్లాకు చెందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్
- స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటాయంటూ కేసు
- టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్న ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా ప్రతాప్‌రెడ్డి
- ఈ పిటిషన్‌తో.. కోర్టు 176 జీవోను కొట్టేసిన సుప్రీంకోర్టు
- ఆ తర్వాత కూడా ప్రతాప్‌రెడ్డి మరోసారి స్థానిక సంస్థల రిజర్వేషన్లపై హైకోర్టును కూడా ఆశ్రయించారు
- దీంతో ప్రభుత్వం మొత్తం 59.85 శాతంగా నిర్ణయించిన రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ ఆదేశాలిచ్చింది
- ఈ ఆదేశాలతో బీసీలే 9.82 శాతం రిజర్వేషన్లు కోల్పోవాల్సి వచ్చింది.
12:22 PM, డిసెంబర్ 29, 2023
అచ్చెన్న.. మీ మాటను నిజం చేయండి ప్లీజ్.!
- మేం తలుపులు తెరిస్తే అవతలి పక్షం ఖాళీ : అచ్చెన్నాయుడు
- అయ్యా.. అచ్చెన్నాయుడు.. ఏ బాబు మిమ్మల్ని ఆపింది.?
- మీరు రాజకీయనాయకుడే కదా..
- అవతలిపక్షం ఖాళీ చేసే అవకాశాన్ని ఎందుకు పోగోట్టుకుంటున్నారు.?
- అర్జంటుగా తలుపులు తెరవండి..!
- అవతలి పక్షం ఖాళీ అవుతుందా? లేక మీ పార్టీనే ఖాళీ అవుతుందా?
- 2014-19 మధ్య ఇలాగే తలుపులు తెరిచారు కదా..!
- ఏకంగా 23 మంది పక్కపార్టీ ఎమ్మెల్యేలను డబ్బు సంచులిచ్చి తెచ్చుకున్నారు కదా..!
- అప్పుడు తలుపులు తెరిచి 23మందిని తీసుకున్నపుడు ఏమయింది?
- 2019 ఎన్నికల్లో మీ దుకాణం ఖాళీ అయింది కదా.!
- మీ నెంబర్ 23కి జారిపోయింది కదా.!
- మరోసారి తలుపులు తెరవాలని తహతహలాడుతున్నావా?
- అయినా.. పార్టీ లేదు.. xxx లేదు అన్న మాటల్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నావా?
12:03 PM, డిసెంబర్ 29, 2023
ఇది సామాన్యుడి ప్రభుత్వం, ప్రతీ ఒక్కరి ప్రభుత్వం
- భీమవరం సభలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
- స్వాతంత్ర ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీచే రెండో బార్డోలిగా భీమవరం పిలవబడింది
- భీమవరంలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది
- నూతన జిల్లా కేంద్రం ఏర్పాటుతో భీమవరం ప్రతిష్టను పెంచిన సీఎం జగన్ కి జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు
- చంద్రబాబుకు ఏనాడూ జిల్లాల వికేంద్రీకరణ గురించి ఆలోచన చేయలేదు
- వైఎస్సార్ నాకు చిన్న వయసులోనే నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం
- 2019 ముందు ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకున్నాను
- నువ్వు పోటీ చెయ్యి గెలిచినా ఓడినా నీ వెంట నేనుంటానని జగన్ నాకు ధైర్యం చెప్పారు
- అర్జునుడికి శ్రీ కృష్ణుడు తోడైనట్టు నేను ఒక పార్టీ అధ్యక్షుడి మీద గెలిచాను
- పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్.. అంబేడ్కర్, పూలే, మదర్ థెరిస్సా ఫోటోలు పెట్టుకున్నాడు
- ఇప్పుడు ఆ మహాత్ముల ఫోటోలు తీసేసి చంద్రబాబు నాయుడి పెట్టుకున్నారు
- జన సైనికులు, కాపు యువతకు చంద్రబాబులో అంబేడ్కర్, పూలే, గాంధీ కనిపిస్తున్నారనే సందేశం పవన్ కళ్యాణ్ ఇస్తున్నాడు
- రైతులు, పేదలు, మహిళలపై చంద్రబాబు కక్ష కట్టారు.. చంద్రబాబుకు దత్తపుత్రుడు తోడయ్యారు
- కారంచేడు దళితులకు, వంగవీటి రంగా హత్య పట్ల ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
- గుర్రాలతో తొక్కించిన అంగన్వాడీలకు, పోలీసులతో కాల్పించిన రైతులకు, వెన్నుపోటు పొడిచిన మామ ఎన్టీఆర్ కు క్షమాపణలు చెప్పాలి
- నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం పేరుతో యువతను నయవంచన చేసిన వ్యక్తి చంద్రబాబు
- పేదలకోసం పరితపిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు ప్రజలంతా అండగా ఉండాలి
11:33 AM, డిసెంబర్ 29, 2023
YSRCP సామాజిక సాధికార యాత్ర
- నేడు 36వ రోజు సామాజిక సాధికార బస్సుయాత్ర
- ఇవాళ అరకు,అనంతపురంలో సామాజిక బస్సుయాత్ర
- నేడు అనంతపురం అర్బన్‌లో సామాజిక సాధికార బస్సుయాత్ర
- ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర
- అంబేడ్కర్ విగ్రహం నుంచి పాతవూరు గాంధీ విగ్రహం వరకు యాత్ర
- సా.4 గంటలకు చెన్నకేశవస్వామి ఆలయం దగ్గర బహిరంగ సభ
- హాజరుకానున్న డిప్యూటీ సిఎం అంజాద్ బాషా, మంత్రి ఉషాశ్రీచరణ్
- మాజీమంత్రి పేర్నినాని, జూపూడి ప్రభాకర్, ఎంపీ తలారి రంగయ్య
- నేడు అరకు నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర
- బర్మన్‌గూడ నుంచి హుకుంపేట వరకు బైక్ ర్యాలీ
- అనంతరం హుకుంపేటలో భారీ బహిరంగసభ
10:42 AM, డిసెంబర్ 29, 2023
ఇదేందీ లోకేషా.. నువ్వు బీసీ కాదు కదా.!
- మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ ప్రెస్‌మీట్
- బీసీలు బలహీన వర్గం కాదు.. బలమైన వర్గం
- బీసీలకు అనేక సంక్షేమ పథకాలు కావాలి
- బీసీలను నాయకులుగా తీర్చిదిద్దాలి
- జయహో బీసీ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నాం
- జనవరి 4 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం
- రాష్ట్రస్థాయి సభలో బీసీలకు మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం
- బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తాం
- బీసీలకు శాశ్వత కులధృవీకరణ పత్రం తీసుకొస్తాం
- బీసీ సోదరుల్లో చైతన్యం రావాలి
- బీసీల సమస్యలను పాదయాత్రలో స్వయంగా తెలుసుకున్నా
- మంగళగిరిలో ఎందరో బీసీలున్నారు
- మంగళగిరిలో మాత్రం నేను పోటీ చేస్తాను
10:04 AM, డిసెంబర్ 29, 2023
తూర్పు ఇచ్చే తీర్పు ఎలా ఉండబోతుంది?
- కాకినాడలో నిన్నటి నుంచి ఎడతెగని మంత్రాంగంలో పవన్ కళ్యాణ్
- జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి
- కాకినాడ పార్లమెంటు పరిధిలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో ముఖాముఖి సమీక్ష
- గత నాలుగున్నరేళ్ళ నుండి వార్డు స్ధాయి కమీటీలు ఎందుకు వేయలేదని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్
- గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఎలాంటి ఆందోళనలు, ప్రజా ఉద్యమాలు చేశారని ప్రశ్నించిన పవన్
- పవన్ ప్రశ్నలకు బిక్క ముఖం వేసిన జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు
- వచ్చే ఎన్నికలకు త్యాగాలకు సిద్దం కావాలని స్పష్టత ఇచ్చిన పవన్
- కొన్ని నియోజకవర్గాల్లో టిడిపి సహకరించడం లేదని పవన్ ముందు ఆవేదన వ్యక్తం చేసిన నేతలు
- జగ్గంపేట సీటు టిడిపికి ఇస్తే సహకరించేది లేదన్న పాఠంశెట్టి సూర్యచంద్ర
- పెద్దాపురం సీటు జనసేనకు ఇవ్వాలని పట్టుబడిన తుమ్ముల బాబు
- పిఠాపురం నుండి జనసేన పోటీ చేస్తే టిడిపి నేత వర్మ స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగే అవకాశం ఉందని పవన్ కు చెప్పిన తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్
- మిగతా సీట్లు సరే, భీమవరంలో పరిస్థితేంటని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్
- భీమవరంలో జనసేన గెలిచే అవకాశాలపై పవన్‌కళ్యాణ్ ఆరా
- తెలుగుదేశం మద్ధతిస్తే జనసేన బయటపడుతుందా అన్న విషయంపై చర్చ
- మరో సారి భీమవరం నుంచి అదృష్టం పరీక్షించుకునే యోచనలో పవన్ కళ్యాణ్
- ఈ సారి కూడా ఎమ్మెల్యేగా గెలవకపోతే .. పొలిటికల్ కెరియర్ ప్రమాదంలో పడుతుందన్న ఆందోళనలో పవన్ కళ్యాణ్
10:04 AM, డిసెంబర్ 29, 2023
తప్పుడు రాతలపై వలంటీర్ల కన్నెర్ర
- రాష్ట్రవ్యాప్తంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల దహనం
- మాతో సమ్మె చేయించాలన్న ఎల్లోమీడియా పాచిక పారదు
- సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాటకు కట్టుబడి పనిచేస్తాం
- వాడవాడలా స్పష్టం చేసిన వలంటీర్లు
- ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజల ఇంటివద్దకే చేరేవిధంగా జగన్ వలంటీర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టారు
- సీఎం ఏ ఉద్దేశంతో అయితే ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారో.. తామంతా అందుకు అనుగుణంగానే ప్రభుత్వానికి విధేయులుగా పనిచేస్తున్నాం
- కానీ ఎల్లోమీడియా తమకు లేనిపోనివి ఆపాదించి కథనాలు ప్రచురిస్తున్నాయి
- ప్రజల్లో పత్రికలకున్న విలువను పోగొట్టుకుంటున్నాయి
- వలంటీర్లు సమ్మె చేస్తారంటూ ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేయడం తగదు
- తమను వేగులని, సంఘవిద్రోహ శక్తులని గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్ అన్నారు
- ఆ వ్యాఖ్యల్ని ఈ పచ్చపత్రికలు పతాక శీర్షికలతో ప్రచురించాయి
- గతంలో తమపై అంతలా విషం చిమ్మిన పత్రికలు ఇప్పుడు కొందరితోనైనా సమ్మె చేయించాలని ప్రయత్నిస్తున్నాయి
- కానీ ఆరునూరైనా వారి పాచిక పారదు
09:20 AM, డిసెంబర్ 29, 2023
అలాంటివాళ్లకే వైఎస్సార్‌సీపీ టికెట్లు:విజయసాయి రెడ్డి
- ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపరుచుకున్న ఎమ్మెల్యేలకే తిరిగి వైఎస్సార్సీపీ టికెట్లు
- తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకున్న వారికే టికెట్లు
- కేవలం మెరిట్ ఆధారంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్లు
- మరే ఇతర అంశాలు టికెట్లకు ప్రాతిపదిక కాదు
- ఎక్స్‌లో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి స్పష్టీకరణ
8:30 AM, డిసెంబర్ 29, 2023
నేడు 36వ రోజు సామాజిక సాధికార యాత్ర
- అనంతపురం, అరకు నియోజకవర్గాలలో జరగనున్న బస్సుయాత్ర
- అనంతపురంలో ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న బస్సు యాత్ర
- మధ్యాహ్నం 2.30 గంటలకు అనంతపురం ఆర్ అండ్ బి అతిథి గృహంలో వైసీపి నేతల మీడియా సమావేశం
- 3 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం
- అంబేద్కర్ విగ్రహం నుంచి పాతవూరు గాంధీ విగ్రహం వరకు బస్సు యాత్ర
- 4 గంటలకు చెన్నకేశవస్వామి ఆలయం ఎదురుగా బహిరంగ సభ
- హాజరుకానున్న డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఉషాశ్రీచరణ్, మాజీ మంత్రి పేర్ని నాని, జూపూడి ప్రభాకర్, ఎంపీ తలారి రంగయ్య తదితరులు
అల్లూరి జిల్లా అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గొన ఆధ్వర్యంలో హుకుంపేటలో బస్సుయాత్ర
- ఉదయం 11 గంటలకు బర్మన్ గూడలో వైసీపి నేతల మీడియా సమావేశం
- అనంతరం బర్మన్ గూడా నుంచి హుకుంపేట వరకు భారీ బైక్ ర్యాలీ
- హుకుంపేట కస్తూరిబా పాఠశాలలో నాడు- నేడు పనులను పరిశీలించనున్న మంత్రులు
- మధ్యాహ్నం ఒంటిగంటకు హుకుంపేటలో బహిరంగ సభ
- హాజరుకానున్న మంత్రులు రాజన్న దొర, మేరుగు నాగార్జున, ఇంచార్జ్ మంత్రి గుడివాడ అమర్నాథ్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, సీదిరి అప్పలరాజు తదితరులు
8:23 AM, డిసెంబర్ 29, 2023
మేనిఫెస్టోలపై చర్చకు సిద్ధమా?.. టీడీపీ నేతలకు మంత్రి జోగి రమేశ్ సవాల్
- చంద్రబాబు ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పే సత్తా మీకుందా?
- వీటిపై చర్చకు టైం, ప్లేస్ మీరే చెప్పండి.. మేం వస్తాం
- పొత్తుల పేరుతో అందరి కాళ్లు పట్టుకుంటూ చంద్రబాబు తిరుగుతున్నారు
- ఫెయిల్డ్ పార్టీ.. దివాలా బాబు.. ఇది వారి చరిత్ర..
- అలాంటి పార్టీకి చెందిన అచ్చెన్నాయుడు వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో ఫెయిల్ అయిందని ఆరోపించటం సిగ్గుచేటు
- మేము మా మేనిఫెస్టో హామీల్ని ఎంత చిత్తశుద్ధిగా అమలు చేశామో చర్చిద్దాం రండి
- ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీత మాదిరిగా సీఎం జగన్ భావిస్తారు
- మేనిఫెస్టో అంటే టీడీపీకి పనికిరాని ఒక చెత్త కాగితం
- ప్రజాదరణ ఉన్న ప్రభుత్వం మాది
- మా నాయకుడు జగనన్న నేతృత్వంలో ఈ ప్రభుత్వం సుభిక్షమైన పరిపాలన అందిస్తోంది
ఎన్నికలు దగ్గరపడడంతో మళ్లీ అది చేస్తాం... ఇది చేస్తామంటూ @ncbn అండ్ కో ప్రగల్భాలు పలుకుతున్నారు. అసలు 1995, 1999, 2014 @JaiTDP మేనిఫెస్టోలు సహా 2019 వైయస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టో అమలుపై చర్చకు మేము రెడీ... టైం, ప్లేస్ టీడీపీ నేతలు చెప్పాలి.
— YSR Congress Party (@YSRCParty) December 28, 2023
-మంత్రి జోగి రమేష్
#EndOfTDP pic.twitter.com/tZEPKe7tgF
8:01 AM, డిసెంబర్ 29, 2023
నేడు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర
- ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న బస్సు యాత్ర
- అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి పాతవూరు గాంధీ విగ్రహం దాకా బస్సు యాత్ర
- సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట వేయటంపై హర్షం
- సాయంత్రం 4 గంటలకు చెన్నకేశవస్వామి ఆలయం ఎదురుగా బహిరంగ సభ
- హాజరుకానున్న ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఉషాశ్రీచరణ్, మాజీ మంత్రి పేర్ని నాని, జూపూడి ప్రభాకర్, ఎంపీ తలారి రంగయ్య
7:46 AM, డిసెంబర్ 29, 2023
చంద్రబాబు దింపుడు కల్లం ఆశ.. అందుకేనట బాబు రహస్య మంతనాలు!
- కనుచూపుమేర కానరాని విజయ సూచికలు
- పవన్ కళ్యాణ్, ప్రశాంత్ కిషోర్ అంతా నో యూజ్
- తాజాగా డీకే శివకుమార్‌తో భేటీ
- అక్క ఆరాటమే తప్ప బావ బతకడు అన్నట్లు తయారైంది చంద్రబాబు పరిస్థితి
- చచ్చిన తెలుగుదేశాన్ని లేపి.. మళ్ళీ నాగినీ డాన్స్ అందించడానికి అయన ఎన్ని విధాలా నాగ స్వరం ఊదుతున్నా అయన బుగ్గలు నెప్పెడుతున్నాయి తప్ప పాము లేవడం లేదు.
- కొన్నాళ్ళు పవన్ కళ్యాణ్‌ను వాడుకుని పార్టీకి బలం చేకూరుద్దామని ప్రయత్నించారు
- అబ్బే.. కుదరలేదు. గజ్జి తగ్గడానికి మందు రాస్తే ఆ గజ్జి చేతికి అంటుకుంది తప్ప గజ్జి మానలేదు
- చంద్రబాబుతో అంటకాగిన కొద్దీ పవన్ కళ్యాణ్ బలహీనం అయ్యాడు కానీ టీడీపీకి లాభం రాలేదు
- పైగా కాపులు ఇప్పుడు చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను కలిపి జాయింటుగా టార్గెట్ చేసి తిడుతున్నారు
- దీంతో ఆ పీకే అచ్చిరాలేదని వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(PK )ను తెచ్చారు
- రోగిలో చలనం లేనపుడు, అవయవాలన్నీ చచ్చుబడిపోయినపుడు ఎంత పెద్ద డాక్టర్ మాత్రం ఏమి చేస్తాడు
- కడసారి చూపులు చూసుకోండి అని చెప్పేసినట్లు ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పేశాడు
- దీంతో ఇక చంద్రబాబుకు మిగిలింది దింపుడు కల్లం ఆశ మాత్రమే మిగిలింది
- దీంతో ఇప్పుడు తాజాగా మంచి సక్సెస్ రికార్డ్‌తో దూసుకుపోతున్న కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు.
- కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించడం దగ్గర్నుంచి తెలంగాణాలో అసలు రేసులోనే లేని కాంగ్రెసును అధికార పీఠం ఎక్కించిన ఎపిసోడ్ తాలూకు క్రెడిట్ మొత్తం డీకే శివకుమార్ కు దక్కింది.
- దీంతో ఆయన్ను ప్రసన్నం చేసుకుని కొన్ని ఎత్తులు.. పొత్తులు.. జిత్తులను ప్లాన్ చేసే నిమిత్తము ఆయన్ను కలిసినట్లు తెలుస్తోంది
- అటు ఎన్నికల సమయం ముంచుకొస్తోంది.. ఎటు చూసినా కారుచీకటి. గెలిచే సీట్ ఎక్కడా కానరావడం లేదు
- ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు సైతం కుప్పంలో పోటీకి భయపడి రెండోచోట పోటీ చేస్తారని అంటున్నారు
7:01 AM, డిసెంబర్ 29, 2023
మా అవినీతినే బయటపెడతారా.. మీ అంతు చూస్తాం
- అసైన్డ్ భూముల కేసులో సాక్షులను బెదిరిస్తున్న చంద్రబాబు ముఠా
- 950 ఎకరాల అసైన్డ్ భూముల కేసులో సాక్షులకు వరుస బెదిరింపులు
- ఏకంగా ఐఏఎస్ అధికారులకే తీవ్ర హెచ్చరికలు
- అజయ్‌జైన్, కాంతిలాల్ దండే, చెరుకూరి శ్రీధరే లక్ష్యం
- రియల్టర్ బ్రహ్మానందరెడ్డికీ బెదిరింపులు
- అధికారుల పరిస్థితే ఇలా ఉంటే తమ గతేంటని ఎస్సీ, ఎస్టీ రైతుల ఆందోళన
- పచ్చ ముఠా బరితెగింపుతో శ్రీధర్‌కు ప్రభుత్వం భద్రత
- మిగిలినవారికి రక్షణ కల్పించడంపైనా ప్రత్యేక దృష్టి
6:54 AM, డిసెంబర్ 29, 2023
లోకేష్ పాదయాత్రలో మిస్సయింది ఏంటీ?
- 4 వేల కిమీలు నడుస్తానని చెప్పాడు, 3130 కిమీల దగ్గరే ఆగిపోయాడు
- తక్కిన 900 కిలోమీటర్లకు వెన్నుపోటేశాడు
- మొత్తం 175 నియోజకవర్గాలను చుట్టేస్తానన్నాడు
- 100 అసెంబ్లీ నియోజకవర్గాలకు బ్రేకేశాడు
- అంటే పర్యటించింది 57% సీట్లకే.. ఎగ్గొట్టింది 43% నియోజకవర్గాలకు
లోకేష్ మిస్ చేసుకున్న అంశాలంటంటే.?
- చంద్రబాబు అరెస్టు అయిన అద్భుతమైన అవకాశం జారవిడుచుకోవడం
- రాష్ట్రంలో టిడిపి క్యాడర్‌ను నడిపించలేకపోవడం
- నిరసనలు, ఆందోళనలు చేయాల్సిన సమయంలో ఢిల్లీ పారిపోవడం
నాయకత్వంలో ఇంకా నేర్చుకోవాల్సిన అంశాలేంటీ?
- తాను ఎదగాల్సిన విషయం మరిచిపోవడం
- ఇంకా 73 ఏళ్ల చంద్రబాబే ముఖ్యమంత్రిని చేయాలనుకోవడం
- తనకింకా పదవి చేట్టే అనుభవం లేదని ఒప్పేసుకోవడం
- అదే సమయంలో పక్కపార్టీ నుంచి వచ్చిన పార్ట్‌టైం పొలిటిషియన్ పవన్‌కళ్యాణ్‌ను పొడగడం
- క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలతో పాటు ముఖ్యమైన అంశాలపై విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోలేకపోవడం
- అనర్గళంగా మాట్లాడలేకపోవడం (తెలుగు అయినా, ఇంగ్లీషు అయినా)
- స్థానిక అంశాలపై ఎలాంటి పరిణితి పెంచుకోలేకపోవడం
- సీనియర్లను నడిపించలేకపోవడం
- తన శక్తి సామర్థ్యాలను పెంపొందించుకునే ప్రయత్నం చేయలేకపోవడం
- ఇచ్చిన మాట మీద నిలబడలేకపోవడం
- అనవసరంగా నోరు పారేసుకోవడం
- ఆగ్రహం వ్యక్తం చేస్తే జనం గుర్తిస్తారనుకోవడం
ఇప్పటికిప్పుడు చేయాల్సినవేంటీ?
- తాను ఒక నాయకుడినని తనను తాను నమ్మడం
- పార్టీ పగ్గాలు చేపడతానని తండ్రిని, పార్టీని ఒప్పించడం
- ఎప్పటికైనా నేనే ముఖ్యమంత్రిని అవుతానని కనీసం తనవరకైనా నమ్మడం
- పక్కవారిపై ఆధారపడకుండా.. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం
- ఎల్లోమీడియా భుజకీర్తులను నమ్మకుండా.. చేసిన పనులు, ఇచ్చిన హామీలపై నిజంగా సమీక్షించుకోవడం
- ప్రజల బాగోగులు తెలుసుకుని కొత్త పరిష్కారాలను తీసుకురాగలగడం
- అత్యుత్తమ విధానాలను అనుసరించడం, అనైతిక విధానాలకు (ఫిరాయింపులు, దొంగ ఓట్లు) స్వస్తి చెప్పడం
- షార్ట్‌కట్‌లను నమ్మకుండా కష్టేఫలి అనుకోవడం
6:52 AM, డిసెంబర్ 29, 2023
పాలిటిక్స్ .. నా సెకండ్ ఇన్నింగ్స్ : అంబటి రాయుడు
- YSRCP పార్టీలో అధికారికంగా చేరిన క్రికెటర్ అంబటి రాయుడు
- గత కొన్నాళ్లుగా జిల్లాల్లో పర్యటిస్తోన్న అంబటి రాయుడు
- విద్యార్థులు, యువతను కలిసి మాట్లాడుతోన్న అంబటి రాయుడు
- ఇవ్వాళ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన అంబటి రాయుడు
- కండూవా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్
6:49 AM, డిసెంబర్ 29, 2023
లోకేశ్‌కు నోటీసులు జారీ చేయండి
- విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఆదేశం.
- లోకేశ్ అరెస్ట్‌కు అనుమతిఇవ్వాలన్న సీఐడీ పిటిషన్‌పై విచారణ
- తదుపరి విచారణ జనవరి 9కి వాయిదా
- నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన సీఐడీ అధికారులు
- ఇంట్లో ఉన్నా బయటకురాని లోకేశ్