గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లే క్రమంలో.. జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారాయన. సంక్రాంతి తర్వాత ఈ పర్యటనలు ప్రారంభం కానున్నట్లు తెలిపారాయన.
తాడేపల్లిలో ఉమ్మడి కృష్ణా నేతలతో ఇవాళ వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ భేటీలోనే ఆయన జిల్లాల పర్యటనపై ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ‘‘కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’’ కార్యక్రమం పేరిట జిల్లాలకు జగన్ వెళ్లనున్నారు. ఈ పర్యటనల్లో నేరుగా పార్టీ కార్యకర్తలతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ప్రతీ బుధ,గురువారాల్లో పూర్తిగా వాళ్లతోనే ఉండనున్నారు. వాళ్ల నుంచి పార్టీ బలోపేతానికి సలహాలు తీసుకోనున్నారు.
ఇందుకోసం రోజూ 3 నుంచి 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అలాగే ప్రతీ పార్లమెంట్ నియోజక వర్గంలో సమీక్షలు జరపనున్నారు. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలకు సంబంధించి పార్టీ ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment