24న కబడ్డీ జట్ల ఎంపిక
ఒంగోలు: జిల్లా సీ్త్ర, పురుష కబడ్డీ జట్ల ఎంపిక ఈ నెల 24న స్థానిక డాక్టర్ పర్వతరెడ్డి ఆనంద్ మినీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కుర్రా భాస్కరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాట్‌పై ఎంపిక జరుగుతుందని, ఆసక్తి ఉన్న వారు నేరుగా ఎంపికకు హాజరుకావాలన్నారు. పురుషుల విభాగంలో 85 కేజీల లోపు, మహిళల విభాగంలో 75 కేజీల లోపు బరువు కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఎంపికై న జట్లు త్వరలో సంతనూతలపాడులో నిర్వహించే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి పూర్ణచంద్రరావు 9948343232, 7780497696 నంబర్లను సంప్రదించాలని కోరారు.
24న స్విమ్మింగ్ జిల్లా జట్ల ఎంపిక
ఒంగోలు: సబ్ జూనియర్, జూనియర్ స్విమ్మింగ్ జిల్లా జట్ల ఎంపిక ఈ నెల 24న నిర్వహించనున్నట్లు ప్రకాశం జిల్లా అమెచ్యూర్ అక్వాటిక్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.చంద్రశేఖరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక నెక్ట్స్ జెన్ ఇంటర్నేషనల్ స్కూలు ఆవరణలో ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. ఆసక్తి ఉన్న వారు తమ వయస్సు ధృవీకరణ పత్రం, ఆధార్‌కార్డుతో నేరుగా రిపోర్టు చేయాలన్నారు. ఫ్రీస్టైల్ 50మీ, 100మీ, 200మీ, బ్యాక్ స్ట్రోక్ 50మీ, 100మీటర్లు, బ్రెస్ట్ స్ట్రోక్ 50మీ, 100 మీటర్లు, బటర్ ఫ్‌లై 50మీటర్లు, 100 మీటర్లు ఈవెంట్స్‌లో ఎంపిక ఉంటుందని, ఎంపికై న వారు డిసెంబర్ 7,8 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనాల్సి ఉంటుందన్నారు.
జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపిక
సంతనూతలపాడు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 3, 4 , 5 తేదీల్లో పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన అండర్ 17 రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. పాఠశాల విద్యార్థులు టి.శృతి, కె.చరణ్‌కుమార్ ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు డీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 22 నుంచి 27 వరకు హర్యానాలో జరగనున్న జాతీయస్థాయి హాకీ టోర్నమెంట్‌లో పాల్గొంటారని పీఈటీ తిరుమలశెట్టి రవికుమార్ తెలిపారు. పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఆకుల బ్రహ్మయ్య, పీడీ కె.వనజ, సిబ్బంది పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకారులను హాకీ క్లబ్ మైనంపాడు సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.
24న కార్తీక వనభోజనాలు
ఒంగోలు వన్‌టౌన్: రెడ్డి జనాభ్యుదయ సంఘ కార్తీక వనభోజనాలను ఈ నెల 24న కందుల ఓబుల్ రెడ్డి రిజర్వాయర్, మల్లవరం డ్యాం, గుండ్లాపల్లి వద్ద ఉదయం 8 గంటలకు నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహక సభ్యులు గుడిపాటి చంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలులోని రెడ్డి హాస్టల్‌లో కార్యక్రమ నిర్వహణ కమిటీ సభ్యుల సమావేశం గురువారం నిర్వహించారు. లింగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 2012 నుంచి కార్తీక వనభోజన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సప్త హోమాల కార్యక్రమంలో పాల్గొనే దంపతులు ముందుగా 9440265670 అనే నంబరుకు ఫోన్‌చేసి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment