సైబర్ నేరాలపై అప్రమత్తంగా వ్యవహరించాలి
ఒంగోలు టౌన్: ౖసెబర్ నేరాలపై గ్రామ, వార్డు స్థాయిలో మహిళా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని, నేరాల నియంత్రణతో పాటుగా అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయడంలో క్రియాశీల పాత్ర పోషించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి గురువారం వీడియా కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పాఠశాలలకు చెందిన విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహాలు, సోషల్ మీడియాలో పరిచయాలు, ఆన్‌లైన్ ప్రేమలు, వేధింపుల విషయాల్లో చట్టాల గురించి వివరించాలని తెలిపారు. మహిళలు, పిల్లలు నేరాలకు గురికాక ముందే అవగాహన కల్పించడం మేలన్నారు. సోషల్ మీడియా వేదికను దుర్వినియోగం చేస్తూ జరుగుతున్న సైబర్ నేరాలపై ముందస్తు జాగ్రతలు తీసుకోవాలన్నారు. ప్రజల అత్యాశ, భయాందోళనలను ఆసరా చేసుకొని వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారని, వాటిపై మహిళలకు సరైన అవగాహన కల్పించడం ద్వారా ఆ నేరాల బారిన పడకుండా కాపాడాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని, మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత పడేలా చూడాలన్నారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ప్రభావం ఆయా కుటుంబాలపై తీవ్రంగా ఉంటుందన్నారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడపడం నేరమని, ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రతలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాల కేసుల్లో పట్టుపడి పోలీసు రికార్డుల్లో పేరు ఎక్కితే భవిష్యత్‌లో ఉద్యోగాలు రావని, జీవితాలు దెబ్బతింటాయని చెప్పారు. విద్యార్థు లు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండే విధంగా చూడాలన్నారు. మంచి వాతావరణంలో ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని అలవరుచుకోవాలని సూచించారు. గ్రామ స్థాయిలో శాంతి భద్రలకు విఘాతం కలిగించే వ్యక్తుల సమాచారాన్ని సేకరించి ఉన్నతాధికారులకు తెలియజేయాలని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ కేవీ రాఘవేంద్ర, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ సూర్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ ఏఆర్ దామోదర్
Comments
Please login to add a commentAdd a comment