ఒంగోలులో సినీ నటి శ్రీలీల సందడి
ఒంగోలు టౌన్: నగరంలో సినీనటి శ్రీలీల గురువారం సందడి చేశారు. దెబ్బలు పడతయి రాజా..దెబ్బలు పడతయిరో... అంటూ ఇటీవల పుష్ప–2లో ఐటెం సాంగ్‌తో ఒక ఊపు ఊపిన శ్రీలీలను చూసేందుకు యువత ఎగబడ్డారు. నగరంలోని కర్నూలు రోడ్డులో బస్టాండ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిథిగా శ్రీలీల హాజరై ఆకర్షణగా నిలిచారు. రిబ్బన్ కట్ చేసిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ ఒంగోలు ప్రజలను నూతన వస్త్ర ప్రపంచంలోకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తీసుకెళ్తుందన్నారు. రాబోయే క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో దుస్తులు కొనుగోలు చేసి ఆస్వాదించాలని కోరారు. చిన్నారుల నుంచి యువతీ యువకులు, అన్ని తరగతుల వారికి నచ్చే మెచ్చే దుస్తులు ఇక్కడ లభిస్తాయని చెప్పారు. తొలుత సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సంస్థ డైరెక్టర్లు సురేష్ సీర్ణ, అభినయ్, రాకేష్, కేశవ్‌లు అతిథులకు స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒంగోలులో 38వ బ్రాంచ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఒంగోలు ప్రజలు కోరుకునే నాణ్యత, నవ్యతకు పెద్ద పీట వేసినట్లు తెలిపారు. జిల్లా ప్రజలు తమను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఎన్.విజయకుమార్, నగర మేయర్ గంగాడ సుజాత, కార్పొరేటర్ వేమూరి భవాని తదితరులు పాల్గొన్నారు.
సౌత్ ఇండియా షాపింగ్ మాల్
ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment