రెండు ద్విచక్రవాహనాలు ఢీ
మర్రిపూడి: రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నడంతో రిటైర్డ్ పోష్టుమాస్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని గుండ్లసముద్రం సమీపంలోని టంగుటూరు– పొదిలి ఆర్‌అండ్‌బీ రహదారిపై గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని గుండ్లసముద్రం గ్రామానికి చెందిన రిటైర్డ్ పోస్టుమాస్టర్ మారెడ్డి వెంకటేశ్వర్లు తన ఇంటి నుంచి పొదిలికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మండలంలోని తంగెళ్ల పరిధిలోని రాజుపాలెం గ్రామానికి చెందిన కారుడ్రైవర్ షేక్ బాషా మద్యం సేవించి ద్విచక్రవాహనంపై పొదిలి నుంచి మర్రిపూడి వైపు బయలుదేరాడు. గుండ్లసముద్రం గ్రామశివారులోని గ్రౌండ్‌ఫ్లోర్ ట్యాంక్ సమీపంలోకి వచ్చిన వెంకటేశ్వర్లు ద్విచక్రవాహనాన్ని బాషా బలంగా ఢీకొట్టాడు. దీంతో వెంకటేశ్వర్లు రోడ్‌పై పడిపోయాడు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కారుడ్రైవర్ షేక్ బాషా పరారయ్యాడు. సమీప వాహనాదారులు 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రున్ని ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనలో విశ్రాంత పోస్టుమాస్టర్ వెంకటేశ్వర్లు కుడికాలు, వేళ్లు విరిగిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మెరుగైన చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని ఒంగోలు జీజీహెచ్ వైద్యశాలకు తరలించారు.
రిటైర్డ్ పోస్టుమాస్టర్‌కు తీవ్ర గాయాలు
Comments
Please login to add a commentAdd a comment