బాక్సింగ్ క్రీడాకారుల ఎంపిక
ఒంగోలు: బాక్సింగ్ జిల్లా స్థాయి పురుష క్రీడాకారుల ఎంపిక పోటీలను శుక్రవారం స్థానిక మినీ స్టేడియంలో నిర్వహించారు. ఈ ఎంపిక ప్రక్రియను ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు లెమ్యూల్ రాజు, బాక్సింగ్ కోచ్ వేణు ప్రారంభించారు. ఎంపికై న వారు ఈ నెల 19, 20వ తేదీల్లో కాకినాడ సమీపంలోని పిఠాపురంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు.
ఎంపికై న క్రీడాకారులు
55 కేజీల విభాగంలో ఒ.ఆశిఫ్, 60 కేజీల విభాగంలో పి.రమేష్, 65 కేజీల విభాగంలో బి.ఏడుకొండలు, 70 కేజీల విభాగంలో పి.కిషోర్, 75 కేజీల విభాగంలో డి.గణేష్, 80 కేజీల విభాగంలో కె.వంశీకృష్ణ, 85 కేజీల విభాగంలో ఐ.జస్వంత్, 90 కేజీల విభాగంలో ఎ.రామస్వామికి సర్టిఫికెట్లు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment