పదినెలల బాలుడు కిడ్నాప్
ఒంగోలు టౌన్: నగరంలో పదినెలల పసిబాలుడు కిడ్నాప్ ఘటన శుక్రవారం సంచలనం సృష్టించింది. బాఽధితుల కథనం ప్రకారం.. ఒడిశాలోని జార్ఘంగూడకు చెందిన ప్రదీప్ సునాని, ఊర్వశీ సునానికి నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. వారికి పది నెలల బాబు మహిర్ ఉన్నాడు. మూడేళ్లుగా ఒంగోలులోని కార్‌కేర్‌లో పనిచేస్తున్న ప్రదీప్.. మూడు నెలల కిత్రం నగరంలోని ప్రగతికాలనీ మొదటి లైనులో ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఇటీవల పక్కింటిలో పనిచేయడానికి వస్తున్న దయామణి అనే మహిళ ఊర్వశికి పరిచయమైంది. తరచూ ఇంటికి వచ్చి బాబును ఎత్తుకుని ఆడించేది. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో బాలుడు మహిర్ నిద్రపోతుండగా తల్లి ఊర్వశి స్నానం చేసేందుకు వెళ్లింది. అదే అదునుగా భావించిన దయామణి ఇంట్లో నిద్రపోతున్న బాలుడిని ఎత్తుకెళ్లింది. స్నానం చేసి వచ్చిన ఊర్వశి ఇంట్లో బిడ్డ లేకపోవడంతో ఆందోళనకు గురైంది. చుట్టుపక్కల వెతికినా బాబు కనిపించలేదు. దయామణి ఒక్కతే వచ్చివెళ్లడంతో ఆమైపె అనుమానంతో ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో ప్రదీప్, ఊర్వశి దంపతులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న తాలూకా పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీసీ కెమేరాలను పరిశీలించారు. నగరంలోని బాలాజీనగర్‌కు చెందిన మణికంఠతో కలిసి బాలుడిని దయామణి ఎత్తుకెళ్తున్న దృశ్యాలు రైల్వేస్టేషన్లో కనిపించినట్లు సమాచారం. మణికంఠతో దయామణి సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని, సీసీ కెమేరాలను పరిశీలిస్తున్నామని ఒంగోలు తాలూకా సీఐ అజయ్‌కుమార్ తెలిపారు. బాలుడి చిత్రాలను, అనుమానితురాలు దయామణి చిత్రాలను సోషల్ మీడియాలో పెట్టి గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఒంగోలు ప్రగతికాలనీలో కలకలం స్నేహంగా ఉంటూ దయామణి అనే మహిళ తమ బిడ్డను ఎత్తుకెళ్లిందని తల్లిదండ్రుల ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment