
సత్తా చాటిన బాపట్ల జిల్లా ఎడ్లు
రాచర్ల: మండలంలోని గుడిమెట్ట పంచాయతీ పరిధిలోని రామాపురం గ్రామ సమీపంలోని సిద్ధిభైరవేశ్వరస్వామి మహాశివరాత్రి తిరునాళ్ల సందర్భంగా బుధవారం రాష్ట్రస్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. పోటీల్లో మొత్తం 7 జతలు ఎడ్లు పాల్గొనగా బాపట్ల జిల్లా బల్లికురవ మండలం బల్లికురవ గ్రామానికి చెందిన వీరయ్యస్వామి చౌదరికి చెందిన ఎడ్లు నిర్ణీత 15 నిముషాల్లో 1558 అడుగులు లాగి మొదటి బహుమతి సాధించాయి. అదే విధంగా మార్కాపురం మండలం బొడిచర్ల గ్రామానికి చెందిన నక్షత్రరెడ్డి ఎడ్లు 1443 అడుగులు లాగి రెండో బహుమతి, బేస్తవారిపేట మండలం జేసీ అగ్రహరం గ్రామానికి చెందిన లక్కు సాత్విక్ ఎడ్ల జతలు 1330 అడుగులు లాగి మూడో బహుమతి, రాచర్ల మండలం జేపీచెరువు గ్రామానికి చెందిన బొర్రా రవితేజ చెందిన ఎడ్ల జతలు 1296 అడుగులు లాగి నాల్గవ బహుమతి సాధించాయి. ఎడ్ల పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతిగా రూ.50వేలు, రెండో బహుమతిగా రూ.30 వేలు, మూడో బహుమతిగా రూ.20 వేలు, నాల్గవ బహుమతిగా రూ.10 వేలను ఎడ్ల యజమానులకు దేవస్థానం ధర్మకర్త మధిరె శ్రీరంగారెడ్డి, ఉప ధర్మకర్త శ్రీరంగపు వెంకట నారాయణరెడ్డి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment