
జగనన్నతోనే పేదలకు న్యాయం
సంతనూతలపాడు: పేదలకు న్యాయం జగనన్నతోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. మండలంలోని గుమ్మలంపాడులో ప్రసన్నాంజనేయస్వామి 60వ వార్షిక మహోత్సవాన్ని బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు ఇన్‌చార్జి చుండూరు రవిబాబు, మహిళా విభాగం అధ్యక్షురాలు దుంపా రమణమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రభలపై బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకులు ఇద్దరేనన్నారు. ఒకరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాగా, రెండో వ్యక్తి ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జగనన్న పాలనలో అర్హులందరికీ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందాయన్నారు. ప్రభుత్వ సేవలను గ్రామస్థాయిలో అందించేందుకు సచివాలయ వ్యవస్థ రూపకల్పన చేశారని కొనియాడారు. మా కుటుంబంపై ప్రేమ, నమ్మకంతో నా తల్లికి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా, నాకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షునిగా జగనన్న అవకాశం కల్పించారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేసి మళ్లీ జగనన్ను సీఎం చేసుకునేందుకు అందరూ కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఒంగోలు ఇన్‌చార్జి చుండూరు రవిబాబు మాట్లాడుతూ 10 నెలల కూటమి ప్రభుత్వ పాలనను చూసి ప్రజలు తప్పు చేశామని బాధపడుతున్నారన్నారు. అందరం కలిసికట్టుగా ముందుకు సాగి వైఎస్సార్‌సీపీని మళ్లీ అధికారంలోకి తీసుకువద్దామన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి, బొక్కిసం శివరామయ్య, మొలకలపల్లి సుబ్బారావు, బొడ్డపాటి ఆంజనేయులు, బొడ్డపాటి శ్రీనివాసరావు, మంగపాటి శ్రీనివాసరావు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ,
వచ్చే ఎన్నికల్లో జగనన్నను మళ్లీ సీఎం చేసుకుందాం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి