డీఈవోగా జగన్మోహన్‌రెడ్డి
● నాగర్‌కర్నూల్‌కు రమేశ్‌కుమార్
సిరిసిల్ల ఎడ్యుకేషన్: జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్ నాగర్‌కర్నూల్‌కు బదిలీ అ య్యారు. ఆయన స్థానంలో జగిత్యాల జిల్లా డీఈవో జగన్మోహన్‌రెడ్డి రానున్నారు. ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మిడ్‌మానేరులో 26 టీఎంసీలు
బోయినపల్లి(చొప్పదండి): మిడ్‌మానేరులో 26.63 టీఎంసీలకు నీటిమట్టం చేరింది. ప్రాజెక్టులోకి పై ప్రాంతం నుంచి ఎలాంటి ఇన్‌ఫ్లో లేదు. ప్రాజెక్టు నుంచి శుక్రవారం కుడికాల్వకు 150 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలి
● జిల్లా వైద్యాధికారి వసంతరావు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, హైరిస్క్ ప్రెగ్నెసీకి సంబంధించి రెగ్యులర్‌గా ఫాలోఅప్ చేయాలని జిల్లా వైద్యాధికారి వసంతరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో అంజలి పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో నేషనల్ హెల్త్ ప్రోగ్రాంలో భాగంగా శుక్రవారం ఎంసీహెచ్, ఎన్‌సీకి సంబంధించి సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మొదటి 84 రోజుల్లోపే గర్భిణి వివరాలు నమోదు చేసి సంబంధిత ప్రాథమిక, జిల్లా ఆస్పత్రుల్లో క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని సూచించారు. ఎంసీహెచ్ కో–ఆర్డినేటర్ బాలచందర్, ఎన్‌సీడీ కో–ఆర్డినేటర్ సత్యనారాయణ, హెచ్‌ఈ బాలయ్య, ఇన్‌చార్జి మెడికల్ అధికారి స్రవంతి, డాక్టర్ చిరంజీవి ఉన్నారు.
స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలి
● డిప్యూటీ డీఎంహెచ్‌వో రజిత
సిరిసిల్లటౌన్: స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో అంజలి సూచించారు. జిల్లాలోని స్కానింగ్ సెంటర్లను శుక్రవారం తనిఖీ చేసి మాట్లాడారు. స్కానింగ్ సెంటర్‌లో పీసీపీఎన్డీ టీ పోస్టర్లు, రిజిస్ట్రేషన్ సర్టిఫి కెట్లు, పొల్యూషన్, శానిటేషన్ సర్టిఫికెట్లు, డాక్టర్లు, సిబ్బంది వివరాలు, ధరల పట్టికను గోడలపై ప్రదర్శించాలని ఆదేశించారు. హెచ్‌ఈ బాలయ్య, సీహెచ్‌వో బాలచంద్రం పాల్గొన్నారు.
ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు జరిగేలా చూడాలి
గంభీరావుపేట(సిరిసిల్ల): ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు జరిగేలా చూడాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో అంజలి సూచించారు. మండలంలోని లింగన్నపేట పీహెచ్‌సీని శుక్రవారం తనిఖీ చేసి మాట్లాడారు. ఏఎన్‌ఎంలు, ఆశకార్యకర్తలు ఇంటింటి సర్వే చేసి గర్భిణీల వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. మండల వైద్యాధికారి స్రవంతి, హెచ్‌ఈ బాలయ్య, సీహెచ్‌వో రమేశ్ ఉన్నారు.
ఆలయ ఉద్యోగులకు పదోన్నతులు
వేములవాడ: రాజన్న ఆలయంలో రికార్డు అసిస్టెంట్లుగా పనిచేస్తున్న పోతారం శ్రీనివాస్, వై.శివకుమార్, నీలి సుశీల్‌కుమార్, తాళ్లపల్లి అజయ్‌కుమార్‌లకు జూనియర్ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారికి శుక్రవారం పదోన్నతుల పత్రాలు ఈవో వినోద్‌రెడ్డి అందించారు. ఏఈవో శ్రవణ్, పర్యవేక్షకురాలు పూజిత, సీనియర్ అసిస్టెంట్ పురాణం వంశీమోహన్, ఆలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కూరగాయల శ్రీనివాస్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment