మార్కెట్ కమిటీలు ఖరారు
వేములవాడరూరల్: ఎట్టకేలకు వేములవాడ నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించారు. వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నాగాయపల్లికి చెందిన రొండి రాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ అ య్యాయి. వైస్‌చైర్మన్‌గా పార్టీ వేములవాడ పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేశ్‌ను నియమిస్తూ 18 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. విప్ ఆది శ్రీనివాస్ కొన్ని రోజులుగా గ్రామ స్థాయి కార్యకర్త నుంచి మండల స్థాయి నాయకుడి వరకు అందరి అభిప్రాయాలు తీసుకుని కమిటీని నియమించినట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు. కాగా కొంతమంది సీనియర్లు చైర్మన్ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినా వారు నిరాశ చెందకుండా భవిష్యత్‌లో మంచి అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చినట్లు సమాచారం.
ఎల్లయ్యకు స్వీటు తినిపిస్తున్న అభిమానులు
నిజామాబాద్ చైర్మన్‌గా ఎల్లయ్య
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కచ్చకాయల ఎల్లయ్య, వైస్‌చైర్మన్‌గా తాళ్లపల్లి ప్రభాకర్ నియమితులయ్యారు. డైరెక్టర్లుగా మాందాల లింబయ్య, వెంగళ వెంకటేశ్వ ర్లు, సాసాల మల్లేశం, అప్పాల నాగభూషణం, ఇస్లావత్ వాల్యా, మహ్మద్ అజీంపాషా, గొట్టిపర్తి లత, ముత్యాల శ్రీనివాస్‌రెడ్డి, మ్యాకల ప్రభాకర్, నాయిని ప్రభాకర్, ఉప్పుల రాజేందర్, బాశెట్టి నాగరాజును నియమించారు.కొలనూర్ సింగిల్‌విండో చైర్మన్, వ్యవసాయ శాఖ ఏడీ, నిజామాబాద్ గ్రామ ప్రత్యేకాధికారులను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
రుద్రంగి చైర్మన్‌గా తిరుపతి
రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చెలుకల తిరుపతి, పాలకవర్గాన్ని నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్ అభివృద్ధికి, యార్డులో రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment