సామూహిక ఇంకుడు గుంతలు నిర్మించాలి
సిరిసిల్ల: జిల్లా వాటర్ శానిటేషన్ మిషన్‌లో సామూహిక ఇంకుడుగుంతులు నిర్మించాలని, డీడబ్ల్యూఎస్‌ఎం లక్ష్య సాధనకు కృషిచేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్‌లో శుక్రవారం స్వచ్ఛభారత్ మిషన్, గ్రామీణ్ జల్‌జీవన్ మిషన్‌లపై శుక్రవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా విభాగాలను పర్యవేక్షించేందుకు జిల్లా వాటర్ శానిటేషన్ మిషన్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లాను ఓడీఎఫ్ ప్లస్‌గా ప్రకటించామని కొత్త ఇళ్ల నిర్మాణాలకు విధిగా టాయిలెట్ ఉండేలా చూడాలన్నారు. కంపోస్ట్‌షెడ్, సామూహిక ఇంకుడుగుంతలను పూర్తిస్థాయిలో వినియోగించాలని కలెక్టర్ ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా కోసం ఉపాధిహామీలో నిధులు వినియోగించాలన్నారు. డీఆర్‌డీవో శేషాద్రి, జెడ్పీ సీఈవో వినోద్, డీఏవో అఫ్జల్‌బేగం, డీపీఆర్‌వో శ్రీధర్, ఇరిగేషన్ ఈఈ అమరేందర్‌రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ జానకీ, డీఈవో రమేశ్‌కుమార్, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, స్వచ్ఛ భారత్ మిషన్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆహార పదార్థాల నాణ్యతపై దృష్టి పెట్టండి
సిరిసిల్లఎడ్యుకేషన్: గురుకులాల్లో ఆహార పదార్థాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రిన్సిపాల్‌ను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్లలోని గురుకుల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూరగాయలు, పండ్ల నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయురాలు పాఠాలు బోధిస్తుండగా పరిశీలించారు. నర్సింహులపల్లి, తంగళ్లపల్లిలోని ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. స్థానిక అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి, విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలు పరిశీలించారు. డీఈవో రమేశ్‌కుమార్ ఉన్నారు.
కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
వరల్డ్ టాయిలెట్ డే పోస్టర్ ఆవిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment