సింగిల్‌విండో చైర్మన్‌పై వీగిన అవిశ్వాసం
● ముస్తాబాద్‌లో సమావేశం నిర్వహించిన డీసీవో ● 9 మందికి 8 మంది డైరెక్టర్లే హాజరు
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ సింగిల్‌విండో చైర్మన్ అన్నం రాజేందర్‌రెడ్డిపై డైరెక్టర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. జిల్లా సహకార అధికారి టి.రామకృష్ణ ముస్తాబాద్ సింగిల్‌విండో ఆఫీస్‌లో శుక్రవారం అవిశ్వాస సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 10.30 గంటలకు వైస్‌చైర్మన్ నిమ్మల రవి ఆధ్వర్యంలో ఏడుగురు డైరెక్టర్లు ఆరుట్ల భాగ్యమ్మ, బద్దిపడిగె బాల్‌రాజిరెడ్డి, పెంజర్ల బాలెల్లు, మిడిదొడ్డి దేవేందర్, గాడిచర్ల రామచంద్రం, కొండం వేణు, యారపు భూమయ్యలు హాజరయ్యారు. కోరం ఉండడంతో అవిశ్వాస తీర్మానంపై డీసీవో చర్చ పెట్టారు. అనంతరం ఓటింగ్ నిర్వహించగా.. 8 మంది డైరెక్టర్లు మాత్రమే రాజేందర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఓటువేశారు. అవిశ్వాస తీర్మానానికి 9 మంది డైరెక్టర్లు అవసరం ఉందని, 8 మంది మాత్రమే ఓటు వేయడంతో తీర్మానం వీగిపోయిందని ప్రకటించారు. తొలుత 9 మంది డైరెక్టర్లు అవిశ్వాసానికి నోటీసులు ఇవ్వగా.. తీర్మానం రోజున ఒక డైరెక్టర్ కొప్పు రాజవ్వ గైర్హాజరుకావడంతో అవిశ్వాసం వీగిపోయింది.
‘సంఘాన్ని కాపాడుకునేందుకే అవిశ్వాసం’
ముస్తాబాద్ సింగిల్‌విండోను, రైతుల ఆస్తులను కాపాడుకునేందుకు చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టామని వైస్‌చైర్మన్ నిమ్మల రవి, ఏడుగురు డైరెక్టర్లు పేర్కొన్నారు. ముస్తాబాద్ సింగిల్‌విండో చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం అనంతరం శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా సంఘంలో ఒకరిని నియమించేందుకు చైర్మన్ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయి, అవిశ్వాసం పెట్టినట్లు తెలిపారు. వైస్‌చైర్మన్ నిమ్మల రవి, డైరెక్టర్లు కొండం వేణు, భాగ్యమ్మ, బాలెల్లు, బాల్‌రాజిరెడ్డి్, మిడిదొడ్డి దేవేందర్, రామచంద్రం, భూమయ్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment