ఆత్మవిశ్వాసంతో నిలబడ్డాడు
● కారు ప్రమాదంలో విరిగిన కాలు ● కూరగాయలు విక్రయిస్తూ ఉపాధి
బోయినపల్లి(చొప్పదండి): సాఫీగా సాగిపోతున్న నేతన్న జీవితంలో అనుకోకుండా జరిగిన ప్రమాదం జీవితాన్ని తలకిందులు చేసింది. కాలు విరగడంతో సాంచాల పని చేయలేని గంగాధర మండలం గర్శకుర్తికి చెందిన చిందం శ్రీధర్ కారులో కూరగాయలు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాడు. వృత్తిరీత్య నేతకార్మికుడు అయిన శ్రీధర్ సాంచాల మెకానిక్ పని కూడా చేసేవాడు. నాలుగు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీధర్ కాలు మూడు చోట్ల విరిగింది. పెద్ద మొత్తంలో ఖర్చు చేసి కాలు బాగు చేయించుకున్నాడు. చేతిలో కర్ర లేనిదే నడవలేడు. కాలు విరగడంతో సాంచాలు నడపడానికి ఇబ్బంది అవుతుండడంతో కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాడు. కరీంనగర్‌తోపాటు పల్లెల్లోని రైతుల వద్ద కూరగాయల కొని ఇతర గ్రామాల్లో విక్రయిస్తుంటాడు. ఉదయం స్వగ్రామం గర్శకుర్తిలో రాత్రి పూట కారులో బోయినపల్లి మండలం తడగొండ, అనంతపల్లి, బోయినపల్లి, బూర్గుపల్లి తదితర గ్రామాల్లో కూరగాయలు విక్రయిస్తుంటాడు.
Comments
Please login to add a commentAdd a comment