పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలుంటే తెలపండి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 12 లోపు తెలపాని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో అఖిల పక్ష నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈనెల 17న తుది పోలింగ్ కేంద్రాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో 260 గ్రామ పంచాయతీలు, 2,268 వార్డులు ఉన్నాయని, ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలను గుర్తించి డ్రాఫ్ట్ జాబితా విడుదల చేశామన్నారు. ఈనెల 13న అభ్యంతరాలను ఎంపీడీవో పరిశీలించి తుది నివేదిక అందించాలని, 16న కలెక్టర్ ఆమోదంతో తుది నిర్ణయం తీసుకొని 17న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎంపీడీవోల ద్వారా తుది పోలింగ్ కేంద్రాల జాబితా వెల్లడిస్తామన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి డీపీవో శేషాద్రి, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఇసుక రీచ్‌లు గుర్తించాలి
ప్రభుత్వ నిర్మాణాలు, స్థానిక, వాణిజ్య అవసరాల కు ఇసుక రీచ్‌లను గుర్తించాలని కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ మీటింగ్‌లో మాట్లాడారు. జిల్లాలోని ఇసుక రీచ్‌లపై ఆరా తీశారు. ప్రస్తుతం క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ.100 ఉండగా, రూ.160 పెంచాలని కమిటీ ప్రతిపాదనలు చేశారు. నిబంధనల మేరకు ఇసుక రవాణాకు అనుమతించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆర్డీవో వెంకటఉపేందర్‌రెడ్డి, మైనింగ్ అధికారి క్రాంతికుమార్, డీటీవో లక్ష్మణ్, జిల్లా ఇరిగేషన్ అధికారి అమరేందర్‌రెడ్డి, సర్వే ఏడీ వినయ్‌కుమార్, భగీరథ ఈఈ జానకి పాల్గొన్నారు.
15లోగా ఇవ్వాలి
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ఈనెల 15 లోగా ఇవ్వాలని కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా కోరారు. కలెక్టరేట్‌లో సీఎమ్మార్‌పై అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్షించారు. జిల్లాలోని కొందరు బాయిల్డ్, రా రైస్ మిల్లర్ల నుంచి గత ఖరీఫ్, రబీ సీజన్ సీఎంఆర్ ఇంకా పెండింగ్ ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పెంచమని పేర్కొన్నారు. ఖరీఫ్ 2024–25 సీజన్ ధాన్యాన్ని తమ మిల్లుల్లో దించుకున్న యజమానులు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని ఆదేశించారు. పౌరసరఫరాల జిల్లా మేనేజర్ పి.రజిత, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment