అంబేడ్కర్ జంక్షన్ డిజైన్ మార్చాలి
వేములవాడ: పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ డిజైన్ మార్పు చేసి అహ్లాదకరమైన జంక్షన్ ఏర్పాటు చేయాలని అంబేడ్కర్ విగ్రహ జేఏసీ, అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రారంభమైన జంక్షన్ పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంబేడ్కర్ చౌరస్తా సుందరీకరణ డిజైన్ కోసం ప్రజాసంఘాల అభిప్రాయాన్ని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ సేకరించాలని విజ్ఞప్తి చేశారు. గార్డెన్ సెంటర్ పాయింట్‌లో విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నిమ్మిశెట్టి విజయ్, సిరిగిరి రామచందు, గోలి మహేశ్, నాయకులు దుమ్మ ఆనంద్, సంటి అంజిబాబు, గుండా థామస్, మూలే కిషోర్, బొడ్డు రాములు, జక్కుల యాదగిరి, జింక శ్రీధర్, సిరిగిరి శ్రీకాంత్, పిట్టల సతీశ్, లింగంపల్లి కిరణ్, గుడిసె మనోజ్‌కుమార్, వంకాయల మహేశ్వర్, తాళ్లపల్లి నాగరాజ్, బొజ్జ చంద్రమోహన్, చర్ల రమేశ్, చర్ల బాలు, వేణుగోపాల్, గుడిసె అరుణ్, అమర్, జింక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment