గాంధీచౌక్:ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉండటానికి షెల్టర్ లేక ఇబ్బందులు
నిరీక్షణలో నీరసిస్తున్నారు
జిల్లా కేంద్రంలో కనిపించని బస్‌షెల్టర్లు
బస్సుల నిరీక్షణకు పడరానిపాట్లు
ఎండా, వాన నుంచి రక్షణ కరువు
పట్టించుకోని అధికారులు
స్మార్ట్‌సిటీలో కానరాని బస్ బే
ఇది సిరిసిల్ల అర్బన్‌బ్యాంక్ ఎదుట ప్రయాణికులు బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక్కడ పదుల సంఖ్యలో ప్రభుత్వ ఆఫీస్‌లు, సెస్ సంస్థ, పోలీస్టేషన్‌తోపాటు ప్రభుత్వ బడులున్నాయి. సిరిసిల్ల నుంచి తంగళ్లపల్లి తదితర గ్రామాలకు వెళ్లడానికి ప్రయాణికులు బస్టాండుకు వెళ్లలేక ఇక్కడ ఆగి బస్సుల కోసం నిరీక్షిస్తారు. నిత్యం వందలాది మంది నిరీక్షించే ఈ స్థలంలో బస్‌షెల్టర్ నిర్మించాల్సిన అవసరం ఉన్నా పాలకులు, అధికారులకు పట్టడం లేదు.
పెద్దాయన బస్సుకోసం ఎండలో నిరీక్షిస్తున్న ఈ ప్రాంతం సిరిసిల్లలోని సాయినగర్. సిరిసిల్ల నుంచి కామారెడ్డి వెళ్లే ప్రధాన రహదారి. నియోజకవర్గంలోని మూడు మండలాలు ఇటువైపే ఉంటాయి. వందలాది సంఖ్యలో విద్యార్థులు ఉన్నత చదువులకు సిరిసిల్లకు వచ్చి వెళ్తుంటారు. వాణిజ్య, వ్యాపారం, ఇతర పనులకు వచ్చేవారి సంఖ్య లెక్కేలేదు. 100 ఫీట్ల రోడ్డున్నా గోపాల్‌నగర్ ఎల్‌ఐసీ వద్ద మినహా ఈ రూట్‌లో ఒక్కటి కూడా బస్ బే లేక జనాలు ఇబ్బందులు పడుతున్నారు.
ఇది జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్. ఇక్కడ వెజ్‌మార్కెట్‌తోపాటు అన్నిరకాల షాపింగ్ కాంప్లెక్సులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని పల్లెల నుంచి ప్రజలు వాణిజ్య, వ్యాపారాలు, షాపింగ్‌కు ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తుంటారు. అసలే ఇరుకైన రోడ్డు కావడంతో ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉండటానికి షెల్టర్ లేక ఇబ్బందులు పడుతున్నారు. గాంధీచౌక్ సమీపంలో బస్ బే అవసరం ఉన్నా ప్రతి పాదనలకే పరిమితమైంది.
సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో బస్‌బేలు లేక ప్రయాణికులు పడుతున్న కష్టాలను పై మూడు ఉదాహరణలే నిదర్శనం. స్మార్ట్‌సిటీగా పేరొందిన సిరిసిల్లలో ప్రయాణికులు బస్సుల కోసం ఎదురుచూసేందుకు కనీసం షెల్టర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షానికి తడుస్తూ.. ఎండకు చెమటలు కక్కుతూ ఇబ్బందులు పడుతున్నారు. నగరాల తరహాలో బస్ బేలు ఏర్పాటు చేస్తామన్న పాలకులు, అధి కారుల మాటలు ఉత్తవే అని నిరూపితమవుతున్నా యి. స్మార్ట్‌సిటీలో భాగంగా రోడ్లు, డివైడర్లు, గ్రీనరీ ఏర్పాటు చేసిన సమయంలోనే పట్టణంలోని ప్ర యాణికులు బస్సుల కోసం నిరీక్షించేందుకు బస్ షెల్టర్ల ప్రాధాన్యతను గుర్తించారు. కోర్టు, ఎల్‌ఐసీ సమీపంలో బస్‌బేలు ఏర్పాటు చేసినప్పటికీ మిగతా చోట్లలో నిర్మాణం పనులు నిలిచిపోయాయి.
ప్రయాణికుల కష్టాలు
● సిరిసిల్లలో కొత్తబస్టాండ్, పాతబస్టాండ్, కోర్టు వద్ద మినహా ఎక్కడ ప్రయాణికులు నిల్చునేందుకు బస్సుషెల్టర్లు లేవు.
● కొత్తబస్టాండ్ నుంచి పాతబస్టాండ్‌కు వచ్చే మార్గంలో ఎల్‌ఐసీ ఆఫీస్‌కు ఎదురుగా బస్సుషెల్టర్ లేదు.
● సిరిసిల్ల నుంచి కామారెడ్డి మార్గంలో ప్రభుత్వ ఆస్పత్రి వద్ద, సాయిబాబా కమాన్ వద్ద బస్సు షెల్టర్లు అవసరం.
● తంగళ్లపల్లి రోడ్డులో మార్కెట్‌కు ఎదురుగా, గాంధీసర్కిల్‌లో మార్కెట్ వద్ద బస్సుషెల్టర్ అవసరం.
● పెద్దబోనాల వంటి రూటులో బస్సులు వెళ్లకున్నా బస్‌బేలు ఏర్పాటు చేశారు. ఇది ఆటోస్టాండ్‌కు పనికొస్తుంది. కానీ నిత్యం వందలాది మంది ప్రయాణికులు నిరీక్షించే గోపాల్‌నగర్, సాయినగర్, గాంఽఽధీచౌక్, అర్బన్‌బ్యాంకు సమీపంలో బస్‌బేలు అవసరం ఉన్నా ఏర్పాటు చేయడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment