సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
బోయినపల్లి(చొప్పదండి): సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ సాధ్యమని ఎస్పీ అఖిల్‌మహాజన్ పేర్కొన్నారు. మండలంలోని కొదురుపాక ఎక్స్‌రోడ్డు, ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను బుధవారం ప్రారంభించారు. ఎస్పీ అఖిల్‌మహాజన్ మాట్లాడుతూ కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. వ్యాపారసంస్థలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. గ్రామాల్లోని చౌరస్తాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉండదన్నారు. వేములవాడరూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై పృధ్వీధర్‌గౌడ్, నాయకులు బండి శ్రీనివాస్, పెంజర్ల బాలమల్లు, నాగుల వంశీ, బాలగోని వెంకటేశ్, కత్తెరపాక రవీందర్ ఉన్నారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ
సిరిసిల్లక్రైం: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధిశిక్షణ ఇవ్వడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం తెలిపారు. పదోతరగతి ఆపై చదువుకున్న వారు ఈనెల 12 నుంచి 15వ తేదీలోగా సంబంధిత పోలీస్‌స్టేషన్‌లలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. సీసీటీవీ అమర్చే విధానంలో భాగంగా సాఫ్ట్‌స్కిల్స్, బేసిక్ కంప్యూటర్‌పై మూడు నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
● ఎస్పీ అఖిల్ మహాజన్
Comments
Please login to add a commentAdd a comment