ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు
సిరిసిల్లలో నిత్యం బస్సుల కోసం నిరీక్షించడానికి బస్‌బేలు నిర్మించాలి. బస్సుకోసం నిరీక్షించేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో అధికారులను చాలాసార్లు విన్నవించినా స్పందన లేదు. అవసరమైన చోట్లలో బస్ షెల్టర్లు నిర్మించాలి.
– కుసుమ గణేష్, సిరిసిల్ల
రోడ్డు వెంట విద్యార్థుల నిరీక్షణ
నిత్యం సిరిసిల్లకు వేలాది మంది విద్యార్థులు వచ్చి వెళ్తుంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారు పట్టణంలోని వివిధ చోట్లలో విద్యాసంస్థల్లో చదువుకుంటుంటారు. వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు బస్సుల కోసం నిరీక్షిస్తుంటారు. రోడ్డు పక్కప గంటల తరబడిగా నిలబడాల్సి వస్తోంది. ఎండ, వాన నుంచి రక్షణగా బస్ బేలు ఏర్పాటు చేయాలి.
– జశ్వంత్, విద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment