పేదల స్థలాలకు రిజిస్ట్రేషన్ హక్కు కల్పించాలి
సిరిసిల్లటౌన్: పేదకార్మికులకు సిరిసిల్ల కార్మికవాడల్లో ఇచ్చిన నివేశ స్థలాలకు రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ కోరారు. సిరిసిల్లలోని అమృత్‌లాల్ శుక్లా కార్మిక భవనంలో గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. కార్మికవాడలైన బీవైనగర్, పీఎస్‌నగర్, ఇందిరానగర్, తారకరామానగర్ ప్రాంత నివాసులకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు లేకపోవడంతో బ్యాంకు నుంచి రుణాలు తీసుకోలేకపోతున్నారన్నారు. ఇప్పటికౌనా ప్రభుత్వం స్పందించి రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, పట్టణ కార్యదర్శి అన్నల్‌దాస్ గణేష్, నాయకులు నక్క దేవదాస్, ఉడుత రవి, కోలా శ్రీనివాస్, చందుపట్ల పోచమల్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment