సిరిసిల్లకల్చరల్: రంగినేని (రేగులపాటి) లక్ష్మి బాల వికాసపురస్కార ప్రదానోత్సవం శనివారం రగుడులోని రంగినేని చారిటబుల్ ట్రస్టు ఆవరణలో నిర్వహిస్తున్నట్లు పిల్లల పండుగ కన్వీనర్ గరిపెల్లి అశోక్ తెలిపారు. ఈసారి పురస్కార గ్రహీతలుగా హైదరాబాద్‌కు చెందిన మాడభూషి లలితాదేవి, విజయవాడకు చెందిన ముంజలూరి కృష్ణకుమారి, సిరిసిల్లకు చెందిన డాక్టర్ కందేపి రాణీప్రసాద్ ఎంపికయ్యారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ దుబ్బాక లావణ్య హాజరవుతారని వివరించారు. పురస్కారాలను ట్రస్టు వ్యవస్థాపకుడు రంగినేని మోహన్‌రావు ప్రదానం చేస్తారు. దీంతోపాటు పిల్లల కథ ఎలా ఉండాలి, ఎలా రాయాలి అనే అంశంపై వర్క్‌షాప్‌తోపాటు ట్రస్టు ముద్రించిన కథలతోట, చిలుకలబండి, బడిబువ్వ, చందమామ రావే పుస్తకాలను ఆవిష్కరిస్తారు. సాహితీప్రియులు పెద్దసంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిర్వాహకులు రంగినేని నవీన్, తూడి వెంకటరావు, పురస్కార కమిటీ సమన్వయకర్త అమూల్య కోరారు.
Comments
Please login to add a commentAdd a comment