రెగ్యులరైజ్ చేయండి
● సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులు
సిరిసిల్లఎడ్యుకేషన్: తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరసన గురువారం సైతం కొనసాగింది. వారు మాట్లాడుతూ ఒక్కొక్కరికి రూ.10లక్షల జీవిత బీమాతోపాటు ఆరోగ్యబీమా కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ చేస్తున్న వారికి రూ.25లక్షలు బెనిఫిట్స్ కింద ఇవ్వాలని, ప్రభుత్వ, విద్యాశాఖ నియామకాల్లో మార్కుల వెయిటేజీ ఇవ్వాలని కోరారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాతూరి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సిరిసిల్లటౌన్: సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు మ్యాడారం హరికృష్ణ కోరారు. మూడు రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు గురువారం సంఘీభావం తెలిపి మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా అభివృద్ధిలో అహర్నిశలు కృషి చేస్తున్న సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ప్రధాన కార్యదర్శి హరేందర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment