కామన్ డైట్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కామన్ డైట్ మెనూ అమలుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీ, మోడల్‌స్కూళ్లు, ఆశ్రమపాఠశాలల్లో కామన్ డైట్ మెనూ అమలుపై సమీక్షించారు. కామన్ డైట్‌ప్లాన్ ఈనెల 14 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. హాస్టళ్లలో కామన్‌డైట్ వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, ప్రతీ హాస్టల్‌లో ఒకే రకమైన ఆహారం విద్యార్థులకు అందించాలని సూచించారు. కిచెన్, డైనింగ్ ఏరియా నిర్వహణ మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 14న ఉదయం 11 గంటలకు అతిథులు రెసిడెన్షియల్ పాఠశాలలకు చేరుకుంటారని, 11 నుంచి 12 గంటల వరకు పాఠశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారని, 12 నుంచి 12.30 గంటల వరకు పిల్లలతో ఇంటరాక్షన్, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. అనంతరం కామన్ డైట్‌ప్లాన్ సంబంధించిన హ్యాండ్‌బుక్‌ను ముఖ్య అతిథి ఆవిష్కరించి ప్రసంగిస్తారని, మధ్యాహ్నం ఒంటి గంటకు ముఖ్య అతిథి, పిల్లలు తల్లిదండ్రులతోపాటు భోజనం చేస్తారని వివరించారు. అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment