క్రీడలతో మానసికోల్లాసం
● ఎస్పీ అఖిల్ మహాజన్
రుద్రంగి(వేములవాడ): చదువు, ఉద్యోగంతోపాటు మానసికోల్లాసానికి క్రీడలు అవసరమని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. రుద్రంగి మండలం దెగావత్‌తండాలో క్రీడాకారులకు గురువారం స్పోర్ట్స్‌కిట్స్ పంపిణీ చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ గంజాయి నిర్మూలనకు సహకరిస్తూ యువత గంజాయి, మత్తుపదార్థాల వ్యసనాలకు అలవాటు పడొద్దని సూచించారు. గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. గ్రామీణ ప్రాంత ప్రజలు నకిలీ గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, ప్రజాశ్రేయస్సే పోలీసుల ధ్యేయమన్నారు. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా కమ్యూనిటీ పోలీస్‌లో భాగంగా జాబ్‌మేళా, దోస్తీమీట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం రుద్రంగి పోలీస్‌స్టేషన్ తనిఖీ చేశారు. చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, రుద్రంగి ఎస్సై అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment