పకడ్బందీగా గ్రూప్–2 పరీక్షలు
● అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఏఎస్పీ చంద్రయ్య
సిరిసిల్లటౌన్: జిల్లాలో గ్రూప్–2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఏఎస్పీ చంద్రయ్య ఆదేశించారు. గ్రూప్–2 పరీక్షల నిర్వహణపై జిల్లా సమీకృత కా ర్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో అబ్జర్వర్స్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్స్, చీఫ్ సూపర్ ఇండెంట్స్, ఫ్లయింగ్ స్క్వాడ్, లోకల్‌రూట్ ఆఫీసర్లకు గురువారం శిక్షణ ఇచ్చారు. జిల్లాలోని 26 పరీక్ష కేంద్రాల్లో 7,163 మంది హాజరుకానున్నట్లు తెలిపారు. మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వారు మాట్లాడుతూ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక రోజు ముందే పరీక్ష కేంద్రాలను సరిచూసుకోవాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment