అనుసంధానం.. ఇక వేగిరం
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ రింగు రోడ్డు ఇదే
రింగు రోడ్డుకు
తొలుగుతున్న ఆటంకాలు
● రైల్వే బ్రిడ్జి పనులకు మోక్షం
● 1.6కిలోమీటర్ల మేర సాగుతున్న పనులు
● మరో 200మీటర్ల పెండింగ్‌ను
సైతం పూర్తి చేస్తేనే అందుబాటులోకి
గజ్వేల్: ఏడాదిక్రితం గజ్వేల్ రింగ్‌రోడ్డు అధికారి కంగా ప్రారంభమైనా.. పూర్తిస్థాయి అనుసంధానం పనులు ఇటీవలే మొదలయ్యాయి. ఈ రోడ్డు జాలిగామ–ధర్మారెడ్డిపల్లి గ్రామాల మధ్య రైల్వే బ్రిడ్డి పెండింగ్‌లో ఉన్న కారణంగా 1.6కిలోమీటర్లు అనుసంధానం ఆగిపోయింది. బ్రిడ్జితోపాటు అప్రోచ్, సర్వీసు రోడ్లను పూర్తి చేయడానికి రైల్వేశాఖ ఇటీవలే పనులు చేపట్టింది. ఎన్నో ఏళ్లుగా రింగు రోడ్డు పూర్తిస్థాయిలో వినియోగానికి రాకుండా అడ్డంకిగా మారిన రైల్వే బ్రిడ్జి పనులు సాగుతుండటం కీలక అడుగుగా భావించవచ్చు. ఈ అంశంపై ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించడం అధికారుల్లో చలనం తెప్పించింది. ఇకపోతే సంగాపూర్ రోడ్డు గజ్వేల్ పాత ఆర్‌డీఓ కార్యాలయం వద్ద 200 మీటర్ల మేర అనుసంధానం కూడా ఇంకా పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం ఈ పనులను సైతం పూర్తిచేయడానికి చొరవ చూపగలిగితేనే పూర్తి స్థాయి అనుసంధానం జరగనున్నది. ఈ దిశగా అధికార యంత్రాంగం కృషి చేయాల్సి ఉన్నది.
అంతర్జాతీయ ప్రమాణాలు..
ఈ రోడ్డుకు అంతర్జాతీయ ప్రమాణాలద్దారు. రింగు రోడ్డుకు అనుసంధానంగా మరో నాలుగు రేడియల్ రోడ్లు 12.5కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగింది. మరెన్నో ప్రత్యేకతలను ఈ రోడ్డు సొంతం చేసుకున్నది. మొత్తం 12 సర్కిళ్లతో ఈ రోడ్డు నిర్మాణం జరిగింది. రింగు రోడ్డు నిర్మాణం వల్ల గజ్వేల్–ప్రజ్ఞాపూర్ పట్టణం చుట్టూ ఉన్న రోడ్డుకు వెలుపలు, బయట భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు ఈ రోడ్డును ఆనుకొని విల్లాలు, అపార్ట్‌మెంట్లు వెలుస్తున్నాయి. అంతేకాకుండా వ్యాపార, వాణిజ్య సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు విరివిగా ఏర్పాటు చేస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రోడ్డు అనుసంధానం వందశాతం పూర్తయితే మున్సిపాలిటీ మరింత వేగంగా అభివృద్ధి చెందడానికి బాటలు పడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment