రాజ్యాధికారమే లక్ష్యం కావాలి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలు ముందుకు సాగాలని, బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మార్కండేయ స్వామి భవన్‌లో నిర్వహించిన బీసీ రాజ్యాధికార సమితి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న దాసు సురేష్, బహుజన ముక్తి పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు దాసు రామ్ నాయక్, బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. రానున్న కాలంలో బీసీలే ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అధిక సంఖ్యలో పోటీ చేసి గెలవాలన్నారు. బీసీలకు మద్దతుగా ప్రచారం చేసి గెలుపు లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వాలు అవలంబించే విధానాలతో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనేక విధాలుగా నష్టపోతున్నారన్నారు.
ఈడబ్ల్యూఎస్‌తో
తీరని నష్టం..
బీసీలందరూ కదలాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
బీసీ రాజ్యాధికార సమితి
వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్
నూతనంగా తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బహుజనులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. బీసీ మహిళలకు సబ్‌కోటా లేని మహిళా రిజర్వేషన్‌లు మాకెందుకు అని ప్రశ్నించారు. బీసీలు ఓటుకు నోటును కట్టడి చేయాలన్నారు. ఇంటికొకరు ఉద్యమిస్తే రాజ్యాధికారాన్ని బీసీలకు బహుమతిగా ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడు తరహాలో రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలును రద్దు చేయాలని కోరారు. బీసీలలోని మహిళలు, యువత భారీగా రాజకీయాల్లోకి రావాలన్నారు. కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్ ముదిగొండ శ్రీనివాస్, మాజీ సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, ప్రొఫెసర్ కృష్ణ దయాసాగర్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, రాములు, గుండు రవితేజ, వెంకటేశం, శ్రీనివాస్, శంకర్, మార్క శ్రీనివాస్ గౌడ్, కనకయ్య, తోట్ల పరశురాములు, శ్రీశైలం, వివిధ బీసీ కుల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment