ముంచెత్తిన వాన
● జిల్లాలో భారీ వర్షం
● కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యం
● పలు చోట్ల నేలవాలిన పంటలు
జిల్లాలో భారీ వర్షం కురిసింది. శనివారం అర్ధరాత్రి, ఆదివారం ఉదయం, సాయంత్రం వేళ కురిసిన వర్షానికి అపార నష్టం వాటిల్లింది. దుబ్బాక నియోజకవర్గంలోని కొనుగోళ్ల కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం రాశులు తడిసిముద్దయ్యాయి. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటం వల్లే ఈ తిప్పలు అంటూ వాపోయారు. కోహెడ మండల కేంద్రంలో మొక్కజొన్న పంట నేలవాలింది. సుమారు 25 ఎకరాలలో మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. అక్కన్నపేటలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందళనకు దిగారు. టార్పాలిన్లు సరఫరా చేయకపోవడం, కొనుగోలు సకాలంలో జరగకపోవడంతో ధాన్యం తడిసి తీరని నష్టం జరిగిందని తెలిపారు.
– దుబ్బాక/అక్కన్నపేట, కోహెడ(హుస్నాబాద్):
Comments
Please login to add a commentAdd a comment