మల్లన్నకు పట్నాలు.. భక్తుల మొక్కులు
రాజగోపురం ఎదుట భక్తుల సందడి
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గంగిరేణు చెట్టు వద్ద ముడుపులు కట్టారు. పట్నాలు వేసి మొక్కులు చెల్లించారు. కొంతమంది భక్తులు స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు.
– కొమురవెల్లి(సిద్దిపేట)
Comments
Please login to add a commentAdd a comment