మాజీ సీఎం కేసీఆర్ చొరవ ఫలితంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ రింగు రోడ్డు మంజూరైంది. తొలుత రూ.220కోట్ల వ్యయంతో 22కిలోమీటర్ల మేర పనులు 2015లో పనులు మొదలయ్యాయి. 16కిలోమీటర్ల పనులు పూర్తయ్యాక వివిధ కారణాలతో పనులు నిలిచిపోయాయి. రూ.220కోట్ల నిధుల్లో సుమారు 50శాతం వరకు నిధులను ఖర్చు చేసిన కాంట్రాక్టర్ ఆ తర్వాత పనుల నుంచి తప్పుకున్నారు. 2018 డిసెంబర్ 2021 డిసెంబర్‌లో ఈ పనులను రూ.118కోట్లతో రీ–టెండర్ చేయించి 2022 జనవరిలో పనులను పునఃప్రారంభించింది. ముందుగా చేపట్టిన పనుల వ్యయంతో రింగు రోడ్డు వ్యయం రూ.233కోట్లకు చేరింది. ఈ రింగు రోడ్డు రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దారు. ఒక పట్టణ అవసరాలకు రింగు రోడ్డు నిర్మించడం ఇదే తొలిసారి.
గజ్వేల్– ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి కంఠహారంగా నిర్మించిన రింగు రోడ్డుకు ఆటంకాలు తొలుగుతున్నాయి. ధర్మారెడ్డిపల్లి–జాలిగామ గ్రామాల మధ్య పెండింగ్‌లో ఉన్న రైల్వే బ్రిడ్జి, 1.6 కిలోమీటర్ల రోడ్డు, అప్రోచ్ రోడ్డు పనులు ఎట్టకేలకు కొనసాగుతున్నాయి. సంగాపూర్ రోడ్డు వైపున మరో 200మీటర్ల అనుసంధానం పూర్తి చేయడానికి చొరవ తీసుకోగలిగితే రోడ్డు పూర్తిస్థాయి అనుసంధానం అందుబాటులోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment