కనీస వేతనాలు అమలు చేయాల్సిందే
సిద్దిపేటఅర్బన్: కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయాల్సిందేనని, ఇందుకు తక్షణం జీఓను విడుదల చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ డిమాండ్ చేశారు. ఆదివారం సిద్దిపేటలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని కార్మికుల ప్రయోజనాలు కాపాడేందుకు కట్టుబడి ఉంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేటికి ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు. పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు, స్కీం వర్కర్లకు జీతాలు పెంచి వారిని ఆదుకోవాలన్నారు. దానికి సంబంధించిన కనీస వేతనాల చట్టాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకోవాలని అన్నారు. స్కీం వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. కార్మికుల కష్టంతో వచ్చిన సెస్ డబ్బులను కార్మికుల సంక్షేమానికే ఖర్చు చేయాలని అన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, జిల్లా కార్యదర్శి గోపాలస్వామి, జిల్లా కోశాధికారి భాస్కర్, సహాయ కార్యదర్శి రవికుమార్, జిల్లా కమిటీ సభ్యులు బాలనర్సయ్య, రంగారెడ్డి, భాస్కర్, షఫిఅహ్మద్, ఎల్లయ్య, భాస్కర్, రాజు, కొమురయ్య, లక్ష్మి, విజయ, రమ పాల్గొన్నారు.
తక్షణం జీఓ విడుదల చేయాలి
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ
Comments
Please login to add a commentAdd a comment