ఉపాధ్యాయ సమస్యలు పట్టని సర్కార్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర కోశాధికారి భాస్కర్‌దేశ్ ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. ప్రజాపాలన అంటే ప్రజలలో ఉద్యోగ, ఉపాధ్యాయులు భాగస్వాములు కాదా అని ప్రశ్నించారు. కొత్త ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం వారి సమస్యల పట్ల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయడం లేదన్నారు. జీవో 317 సమస్య పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా, పూర్తిగా నిరాశపర్చారన్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈనెల 17న ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొని మద్దతును తెలపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మురళీధర్, రాష్ట్ర బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
317జీఓపై ప్రభుత్వం స్పందించాలి
తపస్ రాష్ట్ర కోశాధికారి భాస్కర్‌దేశ్
Comments
Please login to add a commentAdd a comment