భాష, భావం ఉన్న రచనలే నిలుస్తాయి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): భాష, భావం కల్గిన రచనలే ప్రజల మనసుల్లో ఎల్లకాలం నిలిచిపోతాయని జాతీయ సాహిత్య పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐత చంద్రయ్య అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వరరావు రచించిన ‘దృశ్యభాష’ కవితా సంపుటీని ఆదివారం సిద్దిపేటలో జరిగిన జాతీయ సాహిత్య పరిషత్ కార్యవర్గ సమావేశంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కవులు, రచయితలు సంప్రదాయ రచనలతో ముందుకు సాగాలన్నారు. యువత సాహిత్యంవైపు దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో జాసాప అధ్యక్షుడు ఎన్నవెళ్ళి రాజమౌళి, ప్రధాన కార్యదర్శి ఉండ్రాళ్ళ రాజేశం, కోణం పరశురాములు, బస్వరాజ్ కుమార్, చీకోటి రాములు పాల్గొన్నారు.
జాతీయ సాహిత్య పరిషత్ నేత చంద్రయ్య
Comments
Please login to add a commentAdd a comment