అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్
సిద్దిపేటరూరల్: జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై ఎలాంటి అభ్యంతరాలున్నా తెలియజేయాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 491 గ్రామ పంచాయతీల్లో 4,350 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అభ్యంతరాలున్నా తెలియజేయాలని తద్వారా అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment