అర్జీల సత్వర పరిష్కారంపై దృష్టి
సిద్దిపేటరూరల్: జిల్లా వ్యాప్తంగా ప్రజలు అందించిన అర్జీలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సమస్యల పరిష్కారం కోసం అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. మొత్తం వివిధ సమస్యలపై 36 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్‌ఓ నాగరాజమ్మ, డీఆర్‌డీఓ జయదేవ్ ఆర్యా, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి
‘ప్రజావాణి’కి 36 దరఖాస్తులు
ప్రభుత్వ భూమిని కాపాడండి
నాపేరు మాతంగి నాగరాజు. చిన్నకోడూ రు మండల కేంద్రం. మండల పరిధిలోని అల్లీపూర్, చౌడారం రెవెన్యూ గ్రామాలకు చెందిన అటవీ, ప్రభుత్వ భూములను స్థానిక నాయకులు అధికారుల అండదండలతో కబ్జా చేశారు. వందల ఎకరాల్లో భూమిని కబ్జా చేసి విక్రయిస్తున్నారు. ఈ విషయంపై రెవెన్యూ, అటవి శాఖల అధికారులు స్పందించి వెంటనే సర్వే చేయించాలి. కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. – నాగరాజు
Comments
Please login to add a commentAdd a comment