అందరికీ సమాన హక్కులు
సిద్దిపేటకమాన్: భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ కుల, మత తేడా లేకుండా సమాన హక్కులు కల్పించిందని లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి అన్నారు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి న్యాయమూర్తులు, న్యాయ వాదులు మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. న్యాయమూర్తి స్వాతిరెడ్డితో కలిసి ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవరికి అన్యాయం జరిగినా కోర్టు రక్షణగా ఉంటుందన్నారు. ఉచిత న్యాయం కావాలనుకునేవారు లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించాలన్నారు. హక్కులను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. హక్కులకు భంగం కలిగితే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు చందన, శ్రావణి యాదవ్, తరణి, మహిళ పోలీసు స్టేషన్ సీఐ దుర్గ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, సెక్రటరీ మంతూరి సత్యనారాయణ పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
సాయిరమాదేవి
సిద్దిపేటలో అవగాహన ర్యాలీ
Comments
Please login to add a commentAdd a comment