‘గౌరవెల్లి’ని పూర్తి చేసి తీరుతా
● హుస్నాబాద్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా ● బొమ్మ వెంకన్న ఆదర్శనీయుడు ● మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్‌రూరల్: అభివృద్ధిలో హుస్నాబాద్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్తు తెస్తానని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇందుర్తి మాజీ శాసనసభ్యుడు బొమ్మ వెంకటేశ్వర్లు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ బొమ్మ వెంకన్న అందరికీ ఆదర్శ నీయుడన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకే ప్రభుత్వం రూ.430 కోట్లు కేటాయించిందన్నారు. విద్య, వైద్యంలో హుస్నాబాద్‌కు ప్రాధాన్యత ఇస్తానన్నారు. కార్యక్రమంలో బొమ్మ శ్రీరాంచక్రవర్తి, సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment