టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు వినత పత్రం అందిస్తున్న ఎమ్మెల్యే హరీశ్‌రావు
టీటీడీ బోర్డు చైర్మన్‌కు హరీశ్‌రావు వినతి
సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలోని కోమటిచెరువు వద్ద టీటీడీ వారి వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. మంగళవారం తిరుపతి వెళ్లిన ఎమ్మెల్యే హరీశ్‌రావు మర్యాదపూర్వకంగా టీటీడీ బోర్డు నూతన చైర్మన్ బీఆర్ నాయుడును కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో కోమటిచెరువు ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించాలని కోరినట్లు ఫోన్ ద్వారా ‘సాక్షి’కి తెలిపారు. ఇందుకు ఐదెకరాల 10 గుంటల స్థలాన్ని కేటాయించినట్లు వివరించామన్నారు.
గతంలోనే టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు, స్థపతి పర్యటించి ఆలయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించినట్టు చైర్మన్‌కు వివరించారన్నారు. తిరుపతి వేంకటేశ్వర స్వామి అంటే ప్రజలు ఇష్ట దైవంగా.. ఇలవేల్పుగా కొలుస్తారని, అలాంటి ఆలయం సిద్దిపేటలో నిర్మించడం గొప్ప అదృష్టమని హరీశ్‌రావు అన్నారు. వచ్చే టీటీడీ బోర్డు మీటింగ్‌లో సిద్దిపేటలో వెంకటేశ్వర దేవాలయ నిర్మాణానికి ఆమోదం తెలిపి, మీరే ఆలయ నిర్మాణ పనుల శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా బీఆర్ నాయుడిని కోరినట్లు, అందుకు చైర్మన్ బీఆర్ నాయుడు సానుకూలంగా స్పందించారన్నారు. వెంటనే చీఫ్ ఇంజనీర్ అధికారి, సంబంధిత అధికారులను పిలిచి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment