సీఎం కప్ క్రీడలను సక్సెస్ చేద్దాం
సిద్దిపేటరూరల్: జిల్లాలో జరుగుతున్న సీఎం కప్ క్రీడలను క్రీడాశాఖ, జిల్లా అధికారుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో క్రీడాశాఖ, జిల్లా అధికారులతో సీఎం కప్ క్రీడలపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 10 నుంచి 12 వరకు మండల స్థాయిలో పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 17, 18, 19 తేదీలలో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, స్పోర్ట్స్ స్టేడియంలో జిల్లా స్థాయి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడలతో పాటు ఫుట్ బాల్, హ్యాండ్ బాల్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, యోగ, బాక్సింగ్, సైక్లింగ్, జూడో, చెస్, బేస్‌బాల్, రేజ్లింగ్, నెట్‌బాల్ తదితర క్రీడాకారుల ఎంపిక జరుగుతాయన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న క్రీడాకారులను రాష్ట్ర స్థాయి క్రీడలకు పంపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, అదనపు డీసీపీ మల్లారెడ్డి, డీఆర్‌ఓ నాగరాజమ్మ, డీఆర్డీఓ, డీపీఓ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment