హుస్నాబాద్‌రూరల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ మినీ స్టేడియంలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ధృఢత్వాన్ని కలిగిస్తాయన్నారు. గ్రామీణ యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీయడం కోసమే ప్రభుత్వం సీఎం కప్ పేరిట క్రీడా పోటీలు నిర్వహిస్తున్నదన్నారు. తెలంగాణ యువత ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుందన్నారు. హుస్నాబాద్ ప్రాంతం నుంచి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు స్పోర్ట్స్ యూనివర్సిటీలోకి వెళ్లేందుకు పీఈటీ, పీడీలు కృషి చేయాలని చెప్పారు. జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ఆడిన క్రీడాకారులకు రూ.లక్ష, రాష్ట్ర స్థాయిలో ఆడిన వారికి రూ.50వేలు ప్రోత్సాహకాలను అందిస్తానని ప్రకటించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. అనంతరం హుస్నాబాద్, పోతారం(ఎస్) కబడ్డీ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీఓ, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment